twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ. ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు కదా.. చిరంజీవి వల్ల నాకు దెబ్బ పడింది!

    |

    Recommended Video

    Sinior Actor Giribabu Made An Intresting Comments On Chiranjivi And jr.NTR | FilmiBeat Telugu

    vvసీనియర్ నటుడు, దర్శకుడు గిరిబాబు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ అయన నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోలు పోటీ పడుతూ రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో చిరంజీవితో తలెత్తిన విభేదాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఒకరిని మించి మరొకరు

    ఒకరిని మించి మరొకరు

    ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఒకళ్ళని మించి ఒకళ్ళు రాణిస్తున్నారని గిరిబాబు అన్నారు. ఒక హీరోకి ఎక్కువ హిట్లు, మరో హీరోకి తక్కువ హిట్లు ఉండొచ్చు. అది కథలని బట్టి, దర్శకులని బట్టి ఉంటుంది. కానీ నటన, డాన్సులు , ఫైట్స్ విషయంలో ఇప్పుడున్న స్టార్ హీరోలంతా అద్భుతంగా రాణిస్తున్నారు అని గిరిబాబు అన్నారు. ఇక హీరోయిన్లు మాత్రం అందరూ ఉత్తరాది నుంచి దిగుమతి అవుతున్న వాళ్లే ఉన్నారని గిరిబాబు వ్యాఖ్యానించారు.

     జూ. ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు

    జూ. ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు

    ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్ గురించి గిరిబాబు ప్రస్తావించారు. జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. వాడు మామూలోడు కాదు కదా.. అద్భుతమైన ఆర్టిస్టు అని సరదాగా వ్యాఖ్యానించారు. కానీ తాను ఇంతవరకు జూ. ఎన్టీఆర్ చిత్రంలో తాను నటించలేదని అన్నారు. ఇక మహేష్ బాబుతో చిన్నప్పటి నుంచి నటిస్తున్నానని తెలిపారు.

    చిరంజీవితో విభేదాలు

    చిరంజీవితో విభేదాలు

    కొదమసింహం చిత్ర సమయంలో చిరంజీవితో తనకు ఏర్పడిన విభేదాల గురించి గిరిబాబు ప్రస్తావించారు. చిరంజీవి కొదమసింహం తెరకెక్కించినప్పుడే నేను ఇంద్రజిత్ చిత్రాన్ని రూపొందించా. ఆ రెండూ కౌబోయ్ చిత్రాలే. వాస్తవానికి కొదమసింహం చిత్రం ఆలస్యంగా విడుదల కావాల్సింది. ముందుగా మా చిత్రం విడుదల కావాలి. కానీ చిరంజీవి మా చిత్రాన్ని చూసి కొదమసింహం చిత్రాన్ని ముందుగా విడుదల చేశారు. ఆ చిత్రం విజయం సాధించలేదు.

    దెబ్బ పడింది

    దెబ్బ పడింది

    కొదమసింహం, ఇంద్రజిత్ రెండూ కౌబాయ్ చిత్రాలు కావడంతో.. చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమానే ఆడలేదు.. ఇక మీ సినిమా ఏం ఆడుతుంది అని బయ్యర్లు ఎవరూ ఇంద్రజిత్ చిత్రాన్ని కొనడానికి రాలేదు. ఇక చేసేది లేక ఇంద్రజిత్ ని నష్టాలకు అమ్మేశా అని గిరిబాబు అన్నారు. ఇలా ఇండస్ట్రీలో కొన్ని జరుగుతూ ఉంటాయి అని అన్నారు. ఆ తర్వాత నేను, చిరంజీవి విభేదాలు పక్కన పెట్టి మిత్రులుగా మారినట్లు గిరిబాబు అన్నారు.

    English summary
    Actor Giribabu reveals differences with Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X