twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ కూతురు పెళ్లెప్పుడు.. నెటిజన్ ప్రశ్నకు హేమ ఝలక్.. లైవ్‌లో తనదైన స్టైల్లో!

    |

    టాలీవుడ్‌లో సినియర్ నటి హేమ సినీ రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవ చేస్తూ కనిపిస్తుంటారు. ఆమె రాజకీయాలతో కూడా పరిచయం ఉంది. గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇక తాజా కరోనావైరస్ లాక్‌డౌన్‌లో పేద కళకారులకు, సినీ కార్మికులకు అండగా ఉంటున్నారు. తాజాగా సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడుతూ.. రైతులు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. హేమ ఆవేదన ఆమె మాటల్లోనే..

    Recommended Video

    Hema Visits Durga Temple With Her Daughter || బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హేమ
    లాక్‌డౌన్‌లో సినీ కార్మికులకు అండగా

    లాక్‌డౌన్‌లో సినీ కార్మికులకు అండగా

    లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికుల సమస్యలను మా అసోసియేషన్ ద్వారా, వ్యక్తిగతంగాను, నా తోటి సహచరులతో కలిసి నేను సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. సినిమా కార్మికుల సమస్యలే కాకుండా పేద ప్రజల గురించి కూడా ఆలోచించడం, వారికి తగినంత సహాయం చేయడం లాంటి పనుల్లో నిమగ్నమయ్యాను. ప్రస్తుతం రైతుల సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకే ఈ లైవ్‌లో రైతులకు అండగా నిలువాలని పిలుపు ఇస్తున్నాను అని హేమ తెలిపారు.

    రైతులకు గిట్టుబాటు ధర లభించేలా

    రైతులకు గిట్టుబాటు ధర లభించేలా

    లాక్‌డౌన్ సమయంలో రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్ చేరవేయడం లాంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పంటలు కోతలు కోయడానికి సహాయం అందించే విషయంపై ఆలోచనలు చేస్తున్నాం. రైతుల పంటకు గిట్టుబాటు లభించేలా, వారి కష్టాలను తీర్చేలా యూత్‌లో స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు చేయాలి. సినీ హీరోల ఫ్యాన్స్, రాజకీయ పార్టీల కార్యకర్తలు రైతులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ హేమ అభిప్రాయపడ్డారు.

    రైతుల బాధను చూసి

    రైతుల బాధను చూసి

    రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంట ద్వారా సరైన ఫలితాన్ని రాబట్టుకోవడానికి సమస్యలు ఎదురవుతున్నాయని ఫేస్‌బుక్‌లో వారు పెడుతున్న పోస్టులు చూసి హృదయం ద్రవిస్తున్నది. నేను ఊర్లో ఉంటే స్వయంగా వారికి నా సహాయం చేసేందుకు ప్రయత్నించేదానిని. మీరందరి సహాయం తీసుకొనేదానిని. యూత్ తలుచుకొంటే సాధ్యం కానిదేది లేదు అని హేమ అన్నారు.

    స్వప్రయోజనాలు లేవు

    స్వప్రయోజనాలు లేవు

    రైతుల ఆదుకోమని నేను సోషల్ మీడియా కోరడం వెనుక స్వప్రయోజనాలు లేవు. కేవలం రైతుల బాధను చూసి మాత్రమే ఇలా స్పందించాలనిపించింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మీరు కూడా నా ఆవేదనను యూత్‌కు చేరేలా షేర్ చేయండి. రైతులను ఆదుకొనేందుకు సహకారం అందించండి అని హేమ తెలిపారు.

    నా కూతురుకు ఇంకా 16 ఏళ్లే

    నా కూతురుకు ఇంకా 16 ఏళ్లే


    లైవ్‌లో నీ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హేమగా తనదైన స్టయిల్‌లో స్పందించారు. నా కూతురు ఇషాకు 16 ఏళ్లే. బాల్య వివాహాలు చేస్తే పోలీసులు కేసు పెడుతారు. చూడటానికి హైట్‌గా కనిపిస్తుంది. కానీ ఇంకా చిన్నపిల్లే. పెళ్లికి సమయం రాలేదు అని హేమ తనదైన సమాధానం ఇచ్చింది.

    English summary
    Actor Hema ask support and help for Farmers in Corona Lockdown. Hema concerns over Issues of farmers issues. She asks to support and help for farmers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X