twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవిశంకర్ గురూజీని కలిసిన కమల్ హాసన్ (ఫోటోలు)

    |

    బెంగళూరు: యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ బెంగళూరు నగర శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీని కలిసి సుధీర్ఘంగా చర్చించారు. నాస్తికుడు అని గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ రవిశంకర్ గురూజీని కలిసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

    ఇటివల కమల్ హాసన్, గౌతమి జంటగా నటించిన పాపనాశం (తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం) సినిమా విడుదల అయ్యింది. పాపనాశం సినిమా పేరుకు రవిశంకర్ గురూజీకి సంబంధం ఉంది. రవిశంకర్ గురూజీ పుట్టింది పాపనాశం అనే ఊరిలో.

    ఇటివల కమల్ హాసన్ వనమామలై జీర్ కు చెందిన వైష్ణవ మఠం చేరుకున్నారు. వైష్ణవ మఠం వెళ్లి వచ్చిన తరువాత ఆయనలో పలు మార్పులు వచ్చాయని ఆయన అభిమాన సంఘాల నాయకులు అంటున్నారు.

    మర్యాదపూర్వకంగా

    మర్యాదపూర్వకంగా

    కమల్ హాసన్ రవిశంకర్ గురూజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో చాల సేపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆవరణంలో చర్చించారు.

    పాపనాశం

    పాపనాశం

    రవిశంకర్ గురూజీ ఆశీస్సులతోనే కమల్ హాసన్ తన చిత్రానికి పాపనాశం అని పేరు పెట్టారని తెలిసింది.

    కమల్ సినిమా కోసం ఎదురు చూపులు

    కమల్ సినిమా కోసం ఎదురు చూపులు

    కమల్ నటిస్తున్న ఫ్రెంచ్ సినిమా తూగావనం విడుదలకు సిద్దం అవుతున్నది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ప్రకాష్ రాజ్, కిశోర్, ఆశా శరత్, సంపత్ రాజ్, ఉమా రియాజ్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

    మిశ్రమ ఫలితం

    మిశ్రమ ఫలితం

    2015లో కమల్ హాసన్ నటించి విడుదలైన ఉత్తమ విలన్ ఫ్లాప్ అయ్యింది. పాపనాశం సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

    షేర్ చేసుకున్న ఫ్యాన్స్

    రవిశంకర్ గురూజీని కమల్ హాసన్ కలిసిన ఫోటోలను ఆయన అభిమానులు ట్వీట్టర్, ఫేస్ బుక్ లలో షేర్ చేసుకున్నారు.

    English summary
    Sri Sri Ravi Shankar the founder of Art of Living, at his ashram in Bengaluru. The photos of the meeting have been released by the actor's fans page on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X