»   » మన హీరోల గాలీ తీసేసాడు... టాలీవుడ్ వింత వేషాలపై కోటా వారి పంచ్ లు..

మన హీరోల గాలీ తీసేసాడు... టాలీవుడ్ వింత వేషాలపై కోటా వారి పంచ్ లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో మరీ నిర్మొహమాటంగా ఉండే ఒకరిద్దరిలో కోటా శ్రీనివాసరావు ఒకరు. పరభాషా నటులని తెచ్చి డబ్బింగులు చెప్పించి మరీ వాడుకోవటం, అవసరం లేని బడ్జెట్లు పెట్టి మరీ సినిమాలని మరీ కాస్ట్లీ చేయటం నచ్చని కోటా... అప్పుడప్పుడూ తన పద్దతిలో టాలీవుడ్ టీకాలు వేస్తూనే ఉంటాడు... తాజాగా గ్రూపుడాన్సర్లని వేసుకుని చేసే డాసులు వేసే కుర్ర హీరోలపై కొన్ని పంచ్ లు వేసారు... నటన వేరూ డాన్స్ వేరూ.., డాన్స్ లూ ఫైట్లూ వస్తే నటన వచ్చేసినట్టు కాదు అన్న సంగతినే చెప్తూ ఇలా అన్నారు.

''నాటిక అంటే ఇలా ఉండాలి.. నటన అంటే అలా ఉండాలి అని ప్రాథమికంగా కొన్ని లక్షణాలుంటాయి. డ్యాన్సులైనా అంతే. కథక్.. కూచిపుడి.. భరతనాట్యం లాంటి నృత్యాలకూ నిబంధనలుంటాయి. కానీ ఇప్పుడు సినిమాల్లో వస్తున్న డ్యాన్సులు చూడండి. హీరోయిన్ ముందు హీరో గెంతుతూ ఉంటాడు. కిందపడి కొట్టుకుంటుంటాడు. అదేమంటే ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా ఉంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది ఎందుకో అర్థం కాదు.

Actor Kota Srinivasa Rao Makes fun of Our Heroes Dances

ఇక మేకప్ పైనా తన అసహనాన్ని వ్యక్తం చేశారు కోటా. ఖైదీ వేషం వేసే నటుడుకి మేకప్ తో పనేంటని, ఖైదీ అంటే మాసిన గడ్డం - మాసిన జుట్టుతో ఉంటాడని - దీనికి కూడా మేకప్ అవసరమా? ఇలాంటి చిన్న మేకప్ లకు కూడా ముంబై నుంచి మేకప్ మెన్లను దిగుమతి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసాడు కోటా. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ తనను తీవ్రంగా వేధిస్తోందని , పోనీ ఏమన్నా మంచి మాటలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఒకప్పుడు ఎవరైనా గడ్డం పెంచితే.. ఏంట్రా పిచ్చోడిలా గడ్డం గీయమని పెద్దోళ్లు అనేవాళ్లు. కానీ ఇప్పుడు అలా చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు" అని కోట అసహనం వ్యక్తం చేశాడు

.పరభాషా నటుల విషయం లోనూ గతం లో ఒకసారి... కారెక్టర్ ఆర్టిస్టులుగా తెలుగువాళ్ళు పనికిరారా? ఎక్కడెక్కడినుంచో విమాన ప్రయాణాలను భరించి, స్టార్ హోటళ్లలో వారికి నివాసం ఏర్పాటు చేసి, సినిమాల్లో అవకాశాలు ఇచ్చి నటింపజేస్తున్నారని, అలా వస్తున్న నటులు సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతున్నారో ఎవరూ గుర్తించటంలేదని, కేవలం కాంబినేషన్ పరంగా మాత్రమే ఇదో వేలంవెర్రిగా తయారైందని గతంలోనే కోట శ్రీనివాసరావు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

తాజాగా 'జనతా గ్యారేజ్' చిత్రంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ను తీసుకువచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ పవర్‌ఫుల్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్రలో మోహన్‌లాల్ నటన అద్భుతమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన కోట శ్రీనివాసరావు, ఉత్తమ నటుణ్ణి తీసుకువచ్చి, ఆ సినిమాలో మోహన్‌లాల్ అద్భుతంగా నటించాడు, అద్భుతంగా నటించాడు అంటూ చెబుతున్నారని, ఇదో హాస్యాస్పద విషయంగా ఆయన వ్యాఖ్యానించారు.


సినిమా విడుదలైనప్పటినుండి సినిమా హీరోగురించి ఎవరూ మాట్లాడడంలేదని, మోహన్‌లాల్ గొప్పగా చేశాడు, గొప్పగా చేశాడు అని అంటున్నారే తప్ప మిగతావాళ్ల గురించి ఎవరూ మాట్లాడడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ పక్కన చేసిన నటుడు తెలుగు ప్రేక్షకులకు నచ్చాలంటే ఎంత బాగా నటించి ఉండాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని, కేవలం ఉత్తమ నటులుగా వున్నవారిని పెట్టుకుంటే సినిమా హిట్ అయిపోతుంది అనుకోవడం తప్పని నిర్మొహమాటం గా చెప్పేసడు కోటా

ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇక్కడ ఉంటే వేరే భాషల నుంచి ఇక్కడకి దిగుమతి చేస్తున్నారని వాళ్లకి అసలు తెలుగులో డైలాగులు కాదుకదా కనీసం చిన్నపాటి మాటలు కూడా చెప్పడం రాదని అలాంటి వాళ్లను పెట్టుకుని లక్షలకు లక్షలకు కుమ్మరిస్తున్నారని... మన వాళ్లకు పొరుగింటి పుల్లకూర రుచి అని టాలీవుడ్ పై ఫైరయ్యారు. ఇప్పుడు ఆయనలో ఆ అసహనం మరింత పెరిగిందనే చెప్పాలి. మరి కోటా మాటలు ఎవరైనా పట్టించుకుంటారో లేదో చూడాలి.

English summary
The Veteran Actor Kota Srinivasa Rao says there used to be few guidelines for Actors in those days but that's not the case now. He particularly objects the floor dances our Young Heroes perform before Heroines in the songs
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu