For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మణిరత్నానికి ‘రోజా’ వింత కోరిక.. నా కూతురును మీరే చూసుకోవాలి

  By Rajababu
  |

  దేశంలో అసహనం పెరిగిపోతుందనే టాపిక్ తర్వాత బాలీవుడ్‌లో ప్రస్తుతం బంధుప్రీతి అనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రోజా ఫేం మధుబాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో రాణించాలంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు. అందుు టాలెంట్, అదృష్టం కలిసి ఉండాలి అని మధుబాల అన్నారు. రోజా, అల్లరి ప్రియుడు తదితర చిత్రాలతో మధుబాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమన్న సంగతి తెలిసిందే. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..

  నా పిల్లలకు హెల్ప్ చేస్తా..

  నా పిల్లలకు హెల్ప్ చేస్తా..

  నాకు ఇద్దరు సంతానం. ఒకరు అమియా (16), కియా (14). ఒకవేళ వాళ్లు సినిమాల్లో నటించాలని అనుకొంటేవారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తా. ప్రతిభావంతులైన శిక్షకుల వద్ద చేర్పించి వారికి సరైన శిక్షణ ఇప్పిస్తాను. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు ఈ రకమైన అవకాశాలు ఉండవు. అయితే ఈ అంశాలే సినిమాల్లో రాణించడానికి సరిపోతాయి అని నేను అనుకొను అని మధుబాల అన్నారు.

  Fidaa Movie Getting Very Good Response in Tollywood :Watch
  మణిరత్నం సారును కలుస్తా..

  మణిరత్నం సారును కలుస్తా..

  యాక్టింగ్‌కు నా కూతురు ఫిట్ అని నాకు నమ్మకం కుదిరితే అప్పుడు నేను ముందుకెళ్తా. కావాలంటే మణిరత్నం సార్‌ను కలుస్తా. నా కూతురు జీవితాన్ని మీ చేతుల్లో పెడుతా. ఇక ఆమెను మీరు చూసుకోవాలి. టాలెంట్ ఉంటే నటిగా తీర్చిదిద్దండని కోరుతా. అంతవరకే నా పని. ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. కష్టపడే మనస్తత్వం, ప్రతిభ, అదృష్టం కలిసివస్తే ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుందని నేను నమ్ముతా అని మధుబాల చెప్పింది.

  యాక్టర్ కావాలని కోరుకొంటున్నది..

  యాక్టర్ కావాలని కోరుకొంటున్నది..

  నా కూతురు అమియా యాక్టర్ కావాలని కోరుకొంటున్నది. తన కోరికను నేను కాదనను. అయితే ముందు చదువు పూర్తి చేయి. విద్య అనేది చాలా ముఖ్యం. చదువు పూర్తయిన తర్వాత సినీ పరిశ్రమలోకి రావొచ్చు. ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయని చెప్పా అని మధుబాల వెల్లడించింది. ప్రతిభ లేకుండా రాణించడం కష్టమని, ప్రేక్షకుల మెప్పు పొందడం అంత సులభం కాదని ఆమె అన్నారు.

  రోజా చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు

  రోజా చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు

  రోజా చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మధుబాల కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే వ్యాపారవేత్త అనంద్ షాను 1999లో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో అంతకు ముందు.. ఆ తర్వాత చిత్రంలో నటించింది.

  ఆరంభ్‌తో బుల్లితెరపై రీఎంట్రీ

  ఆరంభ్‌తో బుల్లితెరపై రీఎంట్రీ

  ప్రస్తుతం బాహుబలి కథ ఆధారంగా వెలువడుతున్న టెలివిజన్ సీరియల్ ఆరంభలో శివగామి పాత్రను మధుబాల పోషిస్తున్నారు. నేను నటించిన గత చిత్రాలను చూడటానికి వారు సిగ్గుపడుతారు. పాతరోజుల్లో నా నటన వారికి నచ్చదు. నా నటనలోని లోపాలను మొహమాటం లేకుండా నాకు చెప్పేస్తారు. వారికి దీపికా పదుకొన్, ఆలియా భట్ అంటే చాలా ఇష్టం అని మధుబాల వెల్లడించారు.

  English summary
  Roja actor Madhubala has daughters, Ameyaa, 16, and Keia, 14. She says that having a family member in the industry always helps, but success depends on talent and destiny. She says she will definitely help if her daughters if they are keen on becoming actors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X