»   » దళితుడిని వేధించిన నటుడిపై కేసు నమోదు

దళితుడిని వేధించిన నటుడిపై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actor Maharshi Raghava booked for abusing Dalit
హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు మహర్షి రాఘవ ఓ దళితుడిని వేధించినట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై మంగళవారం కేసు నమెదైంది. రామ చంద్రాపురం పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు నమోదు అయింది.

బాధితుడు పి. ఈశ్వరయ్య మాట్లాడుతూ...కొల్లూరులోని తన యజమానికి సంబంధించిన భూమిలో చెట్లు నరకుతున్న మహర్షి రాఘవను తాను అడ్డుకోవడానికి ప్రయత్నించానని, దీంతో రెచ్చిపోయిన రాఘవ తనను చంపుతానని బెదిరించాడని, వేధింపులకు గురి చేసాడని ఆరోపించారు.

సదరు భూమికి సంబంధించి... నటుడు మహర్షి రాఘవ, బంజారాహిల్స్‌లోని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ఓనర్ ధారాస్వామికి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. బాధితుడు ఈశ్వరయ్య ఈ భూమికి కాపాలదారుగా ఉంటున్నాడని ఆర్‌సి పురం పోలీసులు తెలిపారు.

'వివాదాస్పద భూమిలో మహర్షి రాఘవ చెట్లు నరకడం ప్రారంభించగానే చెట్లు ఎందుకు నరుకుతున్నావ్ అంటూ ప్రశ్నించానని, దీంతో మహర్షి రాఘవ నన్ను మాటలతో వేధించాడు. చంపుతానని బెదరించాడు' అని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆర్‌సి పురం ఎస్‌ఐ రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈశ్వరయ్య ధారస్వామికి పర్సనల్ అసిస్టెంటుగా పని చేస్తున్నాడు.

సదరు భూమి ధారస్వామికి చెందినదని, 2002లో ఆ భూమిని కొనుగోలు చేసాడని ఫిర్యాదు దారు పేర్కన్నాడు. అయితే మహర్షి రాఘవ ఆ భూమికి తానే యజమానిని అని వాదిస్తున్నారు. ఈ వివాదాస్పద రెండెకరాల భూమి కొల్లూరు గ్రామంలోని సర్వే నెం. 191లో ఉంది. ఈ సంఘనలో పోలీసులు విచారణ ప్రారంభించారు. రాఘవ తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. చిత్రం భళారే విచిత్రం, మహర్షి తదితర చిత్రాల్లో నటించారు.

English summary

 Tollywood actor Maharshi Raghava was booked for allegedly abusing and threatening a Dalit victim on Tuesday. The Ramachandrapuram police booked a case against the actor for SC/ST atrocity and criminal intimidation.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu