»   » మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్‌లో ప్రిన్స్ రికార్డు..

మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్‌లో ప్రిన్స్ రికార్డు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్‌లో ప్రిన్స్ రికార్డు..

సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రిన్స్ మహేశ్‌బాబును ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉంటారు. కానీ మహేశ్ ఎవరని ట్విట్టర్‌లో ఎవరినీ ఫాలో అవుతారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే. ట్విట్టర్ అకౌంట్‌లో మహేశ్ ఫాలోవర్స్ 30 లక్షల మంది ఉండగా, ఆయన ఫాలో అవుతున్నది మాత్రం కేవలం ఒక్కడంటే ఒక్కరినే. అతను ఎవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్. ఈయన ప్రిన్స్ మహేశ్‌కు బావ అన్నది తెలిసిందే.

ప్రిన్స్ మహేశ్ అకౌంట్‌లో 30 లక్షలు..

ప్రిన్స్ మహేశ్ అకౌంట్‌లో 30 లక్షలు..

ఇంటర్నెట్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి అకౌంట్లతో అభిమానులను చేరుకోవడం సులభమైంది. తాజాగా మహేశ్ బాబు ట్విట్టర్‌లో అరుదైన ఘనతను సాధించాడు. ప్రిన్స్ అకౌంట్‌లో 30 లక్షల మంది ఫాలో అవ్వడం ఓ రికార్డు.

రజనీకాత్ సరసన మహేశ్

రజనీకాత్ సరసన మహేశ్

దక్షిణాదిలో సోషల్ మీడియాలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుల్లో రజనీకాంత్‌, ధనుష్, సమంత, శృతిహాసన్ లాంటి వారు ఉన్నారు. వీరందరూ మూడు మిలియన్ల క్లబ్ చేరారు. తాజాగా ఈ క్లబ్‌లో మహేశ్ బాబు చేరారు. ఈ జాబితాలో చేరిన తొలి తెలుగు హీరో మహేశ్ కావడం గమనార్హం.

ట్విట్టర్‌లో రెగ్యులర్ అప్‌డేట్స్

ట్విట్టర్‌లో రెగ్యులర్ అప్‌డేట్స్

ట్విట్టర్‌లో ప్రిన్స్ ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకొంటారు. సేవా కార్యక్రమాలు, వినోద పర్యటనలు తదితర అంశాలను రెగ్యులర్‌గా అప్ డేట్ చేస్తుంటారు.

మురుగదాస్‌ చిత్రంతో బిజిబిజీ

మురుగదాస్‌ చిత్రంతో బిజిబిజీ

మహేష్ ప్రస్తుతం మురుగదాస్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువకానున్నారు. మహేష్ చిత్రం జూన్ 23న విడుదలకు ముస్తాబవుతున్నది. ఆ తర్వాత కొరటాల శివ, వంశీ పైడిపల్లి రూపొందించే చిత్రాలపై మహేశ్ దృష్టిపెట్టే అవకాశం ఉంది.

English summary
Prince Mahesh Babu joined in 3 million club in Twitter. He follows only one person in his account. That person is his brother in law, MP Galla Jayadev.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu