రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు మనోజ్‌కు గాయాలు

వివరాల్లోకి వెళితే...మనోజ్ రాజేంద్రనగర్‌లో జరుగుతున్న ఓ పెళ్లికి హాజరుకావడానికి స్నేహితుడు రంజిత్, డ్రైవర్ నరేష్, బాడీగార్డు రాజుతో కలిసి రాత్రి 8 గంటలకు తన ఇంటి నుంచి ఫార్చూనర్ కారు (ఏపీ 03ఏవై 0019)లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బయలు దేరారు. అప్పా జంక్షన్ దాటిన తరువాత వీరి కారు ప్రమాదానికి గురైంది. బోల్తాపడ్డ కారు 200 మీటర్ల దూరం వరకు రోడ్డును రాసుకుంటూ పోయింది.
గాయపడిన మనోజ్, నరేష్, రాజులను ఓ కారులో బంజారాహిల్స్‌లోని ఆపోలో ఆస్పత్రికి తరలించా రు. రోడ్డుపై మృతి చెంది పడి ఉన్న గేదెను కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ మనోజ్‌కు అపోలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఆయన కుడి చెయ్యి, కుడి కన్ను వద్ద స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు మోహన్‌బాబు, నిర్మల, సోదరుడు మంచు విష్ణు దంపతులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆస్పత్రికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఇక మంచు మనోజ్ ...తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవలు తుమ్మెద' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొహన్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఈచిత్రంలోని తన ఫస్ట్ లుక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. మనోజ్ గెటప్‌ను బట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మనోజ్ మీసాలు లేకుండా కనిపిస్తున్నాడు. తన ఈ లుక్‌లో మీసం లేదని, ఇతర సన్నివేశాల్లో మీసం ఉంటుందని మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన లుక్ చూసి సీరియస్ రోల్ అనుకోవద్దని, ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు మనోజ్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











