»   » పూరి జగన్నాథ్‌తో ‘డ్రగ్’ సంబంధాలు లేవు.. ఎక్సైజ్ ఆఫీస్‌లో సినీ హీరో నందు..

పూరి జగన్నాథ్‌తో ‘డ్రగ్’ సంబంధాలు లేవు.. ఎక్సైజ్ ఆఫీస్‌లో సినీ హీరో నందు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్ మాఫియాతో సంబంధాలు లేకుండానే నాపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదనే ఆవేదనను సినీ నటుడు నందు వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం తాను ఎక్సైజ్ కార్యాలయ అధికారులను కలిసి వివరాలను తెలుసుకోవడానికి వచ్చినట్టు నందు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి..

తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి..

తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే నేను ఎక్సైజ్ ఆఫీస్‌కు వచ్చాను. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నోటీసుల ఇచ్చినట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ నాకు ఈ వ్యవహారంతో సంబంధం ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. నాకు ఏలాంటి డ్రగ్స్‌ ముఠాతో సంబంధం లేదు అని నందు వివరణ ఇచ్చారు.

గతంలో కూడా నా పేరు తెరపైకి

గతంలో కూడా నా పేరు తెరపైకి

గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు నా పేరు ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు కూడా నేను పలు చానెళ్లకు వెళ్లి వివరణ ఇచ్చాను. రూమర్ జోరందుకోవడంతో కావడంతో బ్లడ్ శాంపిల్స్ ఇస్తాను. ఇంకా ఏమైనా పరీక్షలు ఉంటే నిర్వహించుకోమని చెప్పాను. ఒకసారి దొంగతనం చేస్తే అనుమానంతో మరోసారి పిలిచినట్టు ప్రతీసారి నాపై ప్రచారం చేయడం సరికాదు అని ఆయన అన్నారు.

డ్రగ్స్ అంటే తెలీదు.. వాటిలోనే చూశాను..

డ్రగ్స్ అంటే తెలీదు.. వాటిలోనే చూశాను..

డ్రగ్స్ అంటే నాకు అసలు తెలియదు. సినిమాలు, టీవిల్లోనే చూశాను. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. మా ఫ్యామిలికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిప్పు లేకుండానే పొగవస్తున్నది.. అదే నాకు బాధాకరం. ఇప్పటి వరకు నోటీసులు రాలేదు. ఒకవేళ వస్తే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నోటీసులు వచ్చాయనే ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ ఆఫీస్‌కు వచ్చాను ఆయన వెల్లడించారు.

నన్ను ఆ లిస్ట్‌లో చేర్చవద్దు

నన్ను ఆ లిస్ట్‌లో చేర్చవద్దు

ఆధారాలు లేకుండా అనుమానితుల జాబితాలో నన్ను చేర్చవద్దు. నీ మీద ఆరోపణలు రావడం ఏమిటని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేనాను మంచి సంస్కృతి ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. అలాంటిది నన్ను ఇలాంటి వ్యవహారాల్లో ఇరికించవద్దు అని నందు పేర్కొన్నారు.

పూరీతో సంబంధాలు లేవు..

పూరీతో సంబంధాలు లేవు..

డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్న పూరి జగన్నాధ్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నేను ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయలేదు. రాంగోపాల్ వర్మ తీసిన చిత్రంలో మాత్రమే నటించాను. ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో మాత్రమే పూరీతో మాట్లాడాను. ఇప్పటివరకు నేను చిన్న చిన్న చిత్రాల్లోనే నటించాను. పెద్ద డైరెక్టర్లతో సంబంధాలు లేవు అని నందు చెప్పారు.

English summary
Tollywood heroes links with Drug supplier are become sensation in the media. In this juncture, Hero Nandu came to Excise office on Friday. After meeting the official, He spoke to media. while talking to media Nandu said that he don't have links with drug mafia. and furthur said that he do not have close relation with director Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu