»   » కథ చెప్పిన హీరో నాని.. కంగుతిన్న అల్లు అర్జున్.. ఇంతకీ ఏమైంది..

కథ చెప్పిన హీరో నాని.. కంగుతిన్న అల్లు అర్జున్.. ఇంతకీ ఏమైంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో హీరో నాని వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకొన్నాడు. విభిన్న కథలను ఎంచుకొంటూ మినిమమ్ గ్యారెంటి నుంచి సక్సెస్ ఫుల్ హీరో అనే ట్యాగ్‌ను సాధించాడు. అయితే హీరో అవుదామని నాని పరిశ్రమకు రాలేదు. మణిరత్నం సినిమాల స్ఫూర్తితో డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు.

అల్లు అర్జున్ కథ చెప్పాను..

అల్లు అర్జున్ కథ చెప్పాను..

డైరెక్టర్‌గా అవుదామని ప్రయత్నిస్తున్న సమయంలో హీరోలను దృష్టి పెట్టుకోని నాని కథలు రాసుకొన్నారట. అలా రాసుకొన్న కథను హీరో అల్లు అర్జున్‌కు చెప్పినట్టు ఇటీవల ఆయన మీడియాతో పంచుకొన్నారు. అల్లు అర్జున్ ఇమేజ్ సరిపోయే విధగా మంచి కమర్షియల్ సినిమా కథను వినిపించాను అని తెలిపారు.

బన్నీకి బాగా నచ్చింది..

బన్నీకి బాగా నచ్చింది..

తాను చెప్పిన కథ బన్నీకి కూడా బాగా నచ్చింది. అంతలోనే అనూహ్యంగా హీరో కావడం ఆ కథ తెరకెక్కించే అవకాశం రాలేదు. సమయం దొరికితే తప్పుకుండా కథను సినిమాగా తీస్తాను అని నాని చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ గుర్తు చేస్తుంటాడు..

అల్లు అర్జున్ గుర్తు చేస్తుంటాడు..

తాను, అల్లు అర్జున్ కలుసుకొన్నప్పుడల్లా ఆ కథ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ కథ అలాను అలాగే ఉంచు. తప్పకుండా ఆ కథతో సినిమా చేస్తా అని చెప్తుంటాడు అని నాని వివరించాడు. అల్లు అర్జున్‌కు కథ చెప్పిన విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసునని ఆయన అన్నాడు.

రేడియో జాకీ ఉద్యోగం

రేడియో జాకీ ఉద్యోగం

నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో రేడియో జాకీ ఉద్యోగ అవకాశ వచ్చింది. అప్పట్లో నెలకు రూ.16 వేలు ఇస్తానని అన్నారు. ఆ ఉద్యోగం గురించి నాకు చెప్పింది డైరెక్టర్ నందినీరెడ్డి. పార్ట్ టైమ్ జాబ్‌గా చేస్తూనే హీరోలను కలిసి కథలు వినిపించవచ్చని అనుకొన్నాను. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ కథ చెప్పాను అని నానీ తెలిపాడు.

వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్

వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్

అలా మొదలైంది చిత్రంతో హీరోగా మారిన నాని ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, మజ్ను, కృష్ణవాడి వీర ప్రేమ కథ, జెంటిల్‌మెన్, నేను లోకల్ చిత్రాల విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే.

English summary
Before becoming a hero Nani was worked as Assistant Director for few movies. In that time he was narrated a commercial Story to stylish star Allu Arjun. Recently that incident shared with media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu