For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej Accident: ప్రమాదం అలానే.. మరోసారి మాట్లాడకు.. జాగ్రత్త.. శ్రీకాంత్‌కు నరేష్ వార్నింగ్

  |

  మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి మెల్లగా కోలుకుంటున్నాడు అని వైద్యులు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. ఇక త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు కూడా ఎప్పటికప్పుడు ఆసుపత్రిలోకి వెళ్లి అతని గురించి అడిగి తెలుసుకుంటున్నారు అయితే రీసెంట్ గా సినీ నటుడు మా కమిటీ అధ్యక్షుడు నరేష్, సాయికి జరిగిన ప్రమాదంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

  నరేష్ చేసిన కామెంట్స్ పై ఇదివరకే బండ్ల గణేష్, నట్టి కుమార్ లాంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక శ్రీకాంత్ కూడా ఇటీవల ఆ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఇక నరేష్ అందరికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే శ్రీకాంత్ ఇచ్చిన వీడియో బైట్ కు కూడా కౌంటర్ ఇచ్చారు.

  మొదట నరేష్ ఏమన్నారు అంటే..

  మొదట నరేష్ ఏమన్నారు అంటే..

  సాయి ధరమ్ తేజ్ మా అబ్బాయి మంచి స్నేహితులు. అయితే ఇద్దరు బైక్ రేసింగ్‌కి వెళ్తుంటే కౌన్సిలింగ్ ఇద్దాం అని చాలాసార్లు అనుకున్నాను. ఇక ఇలాంటి ప్రమాదాలలో గతంలో కొందరు సెలబ్రేటీల పిల్లలు కూడా మరణించారని అన్నారు. అందుకే పిల్లలను బైక్ రేస్ లకు కాస్త దూరంగా ఉంచడం మంచిది అని నరేష్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  అతని గురించి నాకు బాగా తెలుసు..

  అతని గురించి నాకు బాగా తెలుసు..

  ఇక నరేష్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని ఇదివరకే బండ్ల గణేష్, నట్టి కుమార్ లాంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక శ్రీకాంత్ కూడా ఇటీవల ఆ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఆయన మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కు జరిగింది చాలా చిన్న యాక్సిడెంట్. అది చాలా కామన్ గా జరిగేవి. రోడ్డుమీద ఇసుక కారణంగా బైక్ స్కిడ్ అయిన విషయం అందరికి తెలిసిందే. త్వరగా కోలుకుంటారు. అలాగే దయచేసి ఎవరైనా వీడియోలు బైట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు తెలిసిన యంగ్ స్టర్స్ లో అతను చాలా మెచ్యూర్డ్ పర్సన్. అతని గురించి నాకు బాగా తెలుసు.

  నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ కామెంట్స్

  నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ కామెంట్స్

  అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్ లో ఉన్నారు. టెన్షన్ లో మనం పెట్టే వీడియో బైట్ వల్ల ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు ఉంటుంది. ఇక నరేష్ గారు పెట్టిన వీడియో బైట్ ఇలాంటి టైమ్ లో కరెక్ట్ కాదు. ముఖ్యంగా చనిపోయిన వాళ్ల గురించి కూడా ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అందుకే దయచేసి ఎవరు కూడా ఇలాంటి వీడియో బైట్స్ పెట్టకుండా ఉంటే అనుకుంటున్నాను. అతను త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం అని శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.

  ఏంటమ్మా శ్రీకాంత్ అలా చెప్పావు?

  ఏంటమ్మా శ్రీకాంత్ అలా చెప్పావు?

  ఇక శ్రీకాంత్ స్పందించిన తీరుపై నరేష్ స్పందించారు. ఏంటమ్మా శ్రీకాంత్ అలా చెప్పావు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు మరొక వీడియో బైట్ వదిలారు. ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ అయితే స్పీడ్ లో లేడు. బురదలో జారీ పడ్డాడు. దెబ్బ కూడా తగిలింది. అయితే నేను చెప్పింది మీడియాలో తేడాగా వస్తే.. పెద్దలు నాకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే దానికి నేను ఏం చెప్పాలో చెప్పేశాను.. అని నరేష్ అన్నారు.

  Recommended Video

  Love Story రొమాంటిక్ మూవీ కాదు.. Naga Chaitanya, Sai Pallavi ల గీతాంజలి || Filmibeat Telugu

  నా కళ్ళ ముందు హీరోగా.. వచ్చావు!

  అంతే కాకుండా బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలని శ్రీకాంత్ ను హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే.. ఇక్కడా ఎమోషన్స్ ఉంటాయి. చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు. జనరల్ గా ఇండస్ట్రీలో జరిగే వాటి గురించి చెప్పాను. బైక్ లను మనం చాక్లెట్ తరహాలో మనం పిల్లలకు ఇవ్వము. వాళ్ళు అడల్ట్స్. ఇక ప్రమాదాలు నాకు అలాగే చాలామందికికి జరుగుతాయి.

  కానీ నువ్వు ఆ విధంగా మాట్లాడడం హార్ట్ అయ్యే విధంగా ఉంది. నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. అయితే మా ఎలక్షన్స్ లో పోటీ చేశావు. దురదృష్టవశాత్తు మా ప్యానెల్ ఆపోజిట్ లో ఓడి పోయావు. ఇక దయచేసి ఇలాంటి బైట్స్ ఇవ్వద్దమ్మా అంటూ... నరేష్ శ్రీకాంత్ కు సమాధానం ఇచ్చారు.

  English summary
  Actor naresh serious comments to hero srikanth counter
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X