»   » లోపాలున్నాయి: ‘శంకరాభరణం’పై హీరో నిఖిల్ కామెంట్

లోపాలున్నాయి: ‘శంకరాభరణం’పై హీరో నిఖిల్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్ హీరోగా ప్రముఖ రచయిత కోన వెంకట్ అన్ని తానై తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం'. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాలోని కొన్ని బోరింగ్ సీన్లను తీసేసి సినిమాను ట్రిమ్ చేయాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు.

ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ తన తన ట్విట్టర్లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సినిమాలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమే అని ఆయన ట్విట్టర్ ద్వారా ఒప్పుకున్నారు. ఒక పూర్తి స్థాయి ఎంటర్టెనర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేసాను. నా కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులందరూ నాపై ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్ అని ట్వీట్ చేసారు.

Actor Nikhil about Shankara Bharanam flaws

మిమ్మల్ని మెప్పించడానికి, మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందుకోసం నా వల్ల అయినంత హార్డ్ వర్క్ చేసారు. మరిన్ని విభిన్నమైన సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని నిఖిల్ ట్వీట్ చేసారు. మీ ఆశీర్వాదలు నాకు ఎప్పటికీ ఉండాలనికోరుకుంటున్నట్లు నిఖిల్ పేర్కొన్నాడు.

ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

English summary
"Shankara Bharanam has its flaws but the target audience have found it super Entertaining.. It was a conscious attempt to do a full Entertainer for a change" Nikhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu