»   » పంచెతో పవర్ ‘బ్రదర్స్’.. జీన్స్‌లో నితిన్.. పంట పొలాల్లో ఏం చేస్తున్నారో..

పంచెతో పవర్ ‘బ్రదర్స్’.. జీన్స్‌లో నితిన్.. పంట పొలాల్లో ఏం చేస్తున్నారో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే హీరో నితిన్‌కు ప్రత్యేకమైన అభిమానం. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నితిన్ తన చిత్రాల్లో పవన్ గురించి చెప్తూ.. పవర్ స్టార్ తన ఫామ్ హౌస్‌లో పండిన మామిడిపండ్లను నితిన్‌కు పంపించుకొంటూ ఒకరికొకరు అభిమానాన్ని చాటుకొంటారు.

 పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌తో నితిన్

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌తో నితిన్


తాజాగా కాటమరాయుడు షూటింగ్‌లో నితిన్ పవన్ కల్యాణ్‌ను కలుసుకొన్నారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 పంచె కట్టు పవర్‌లో .. జీన్స్ ప్యాంటులో ..

పంచె కట్టు పవర్‌లో .. జీన్స్ ప్యాంటులో ..


కాటమరాయుడు షూటింగ్‌లో పంచకట్టులో ఉన్న పవన్ కల్యాణ్, శివబాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్, ఆలీ, కమల్‌రాజ్ మధ్య నితిన్ జీన్స్ ప్యాంటులో ఉన్నారు. పచ్చటి పొలాల మధ్య పవన్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నారు.

 నితిన్ చేతికి కాటమరాయుడు హక్కులు

నితిన్ చేతికి కాటమరాయుడు హక్కులు


కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులను భారీ ధరను చెల్లించి నితిన్ దక్కించుకొన్నారు. ఏషియా ఫిల్మ్స్, శ్రేష్ట మూవీస్‌తో కలిసి నైజాం హక్కులను సొంతం చేసుకొన్నామని నితిన్ ఇటీవల ట్వీట్ చేశాడు.

 నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా

నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా


అంతేకాకుండా నితిన్ హీరోగా పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రౌడీ ఫెల్లో దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే అవకాశముందని స్వయంగా నితిన్ తెలిపిన సంగతి తెలిసిందే.

కాటమరాయుడు షూటింగ్‌లో నితిన్ పవన్ కల్యాణ్‌ను కలుసుకొన్నారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Actor Nithin meets Power Star Pawan Kalyan in Katamrayudu Shooting. Nithin posted the photo in social media. That is becomes viral on Internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu