»   » రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం.. (ఫోటోస్)

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాదాపు మూడున్నరేళ్లుగా'బాహుబలి' ప్రాజెక్టే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో అందులో నుండి బయటకు వచ్చి ఇతర సినిమాలపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సోమవారం ఉదయం ప్రారంభం అయింది.

యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరించనున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణం రాజు దంపతులు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డాన్స్ మాస్టర్ రాజు సుందరం, దర్శకుడు సుజీత్, యూవి క్రియేషన్స్ అధినేతలు పాల్గొన్నారు.

 కృష్ణం రాజు క్లాప్

కృష్ణం రాజు క్లాప్

ప్రముఖ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. యూవి క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ నెం. 6గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 టైటిల్ త్వరలో

టైటిల్ త్వరలో

ప్రభాస్ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే మంచి అకేషన్ చూసి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.

 భారీగా పెరిగిన ప్రభాస్ మార్కెట్

భారీగా పెరిగిన ప్రభాస్ మార్కెట్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇపుడు ఆయన సినిమాలకు తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమాకు బడ్జెట్ ఎక్కువైనా మూడు బాషల్లో తీస్తున్నారు.

 రూ. 150 కోట్లకు మించిన మార్కెటింగ్ ప్లాన్స్

రూ. 150 కోట్లకు మించిన మార్కెటింగ్ ప్లాన్స్

రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

 త్వరలోనే పూర్తి వివరాలు

త్వరలోనే పూర్తి వివరాలు

ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటులు, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా.

English summary
Having spent nearly four years on SS Rajamouli’s Baahubali franchise, actor Prabhas will finally focus on his next movie. The film launched today in Hyderabad which will be directed by Sujeeth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu