»   » అభిమాని పట్ల దారుణంగా ప్రవర్తించిన ప్రకాష్ రాజ్!

అభిమాని పట్ల దారుణంగా ప్రవర్తించిన ప్రకాష్ రాజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చెన్నై ఎయిర్ పోర్టులో ఓ అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. చెన్నై విమానాశ్రయంలో ప్రకాష్ రాజ్ ను చూసిన ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు అతడికి దగ్గరగా వచ్చాడు. అయితే అభిమాని ప్రవర్తన నచ్చలేదో, మరేమో తెలియదు కానీ చిర్రెత్తిపోయిన ప్రకాష్ రాజ్ అతడి మొబైల్ తీసి నేలకేసి బద్దలు కొట్టాడు.

ప్రకాష్ రాజ్ ప్రవర్తన చూసి అంతా విస్తుపోయారు. సదరు అభిమాని తన ఫోన్ ధ్వంసం చేసిన ప్రకాష్ రాజ్ మీద ఫిర్యాదు చేసేందుకు అధికారులను సంప్రదించాడు. అయితే అప్పటికే ప్రకాష్ రాజ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేస్తానమి అధికారులు తెలిపినట్లు సమాచారం.

ప్రకాష్ రాజ్ కొడుకు ఇతడే...(ఫోటోస్)

ప్రకాష్ రాజ్ కొడుకు ఇతడే...(ఫోటోస్)

ప్రకాష్ రాజ్ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత బాలీవుడ్ డాన్స్ మాస్టర్ అయిన పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ గతేడాది కొడుకు జన్మించాడు. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

కూతురుతో డిన్నర్: పట్టలేని ఆనందంలో ప్రకాష్ రాజ్ (ఫోటోస్)

కూతురుతో డిన్నర్: పట్టలేని ఆనందంలో ప్రకాష్ రాజ్ (ఫోటోస్)

సంసారం విషయంలో మొదటి భార్య లలితా కుమారితో విబేధాలు వచ్చి చాలా కాలం క్రితమే విడిపోయిన ప్రకాష్ రాజ్...తన రెండో భార్య పోనీ వర్మతో ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు. లలిత కుమారితో విడిపోయినా పిల్లలతో మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్. కూతురంటే ఆయనకు ప్రాణం. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Actor Prakash Raj Breaks Fan Mobile at Chennai International airport.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu