»   » కూతురుతో డిన్నర్: పట్టలేని ఆనందంలో ప్రకాష్ రాజ్ (ఫోటోస్)

కూతురుతో డిన్నర్: పట్టలేని ఆనందంలో ప్రకాష్ రాజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో అద్భుతమైన నటుల లిస్టు తయారు చేస్తే అందులో టాప్ లిస్టులో ఉండే పేరు ప్రకాష్ రాజ్. అటు నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుని సేవా కార్యక్రమాల్లో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్.... పర్సనల్ లైఫ్ లోనూ చాలా హ్యాపీగా ఉన్నాడు.

సంసారం విషయంలో మొదటి భార్య లలితా కుమారితో విబేధాలు వచ్చి చాలా కాలం క్రితమే విడిపోయిన ఆయన...తన రెండో పోనీ వర్మతో ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు. లలిత కుమారితో విడిపోయినా పిల్లలతో మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్. కూతురంటే ఆయనకు ప్రాణం.

తాజాగా ఆయన తన కుమార్తెతో కలిసి డిన్నర్‌ చేసిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కుమార్తెతో కలిసి డిన్నర్‌ చేశానని.. పిల్లలతో కలిసి ఎదగడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

ప్రకాష్ రాజ్ లలిత కుమారి విషయానికొస్తే...తమిళ యాక్టర్ సి.ఎల్.ఆనందన్ కూతురైన లలిత కుమారి నటిగా పలు తమిళ చిత్రాల్లో నటించింది. 1994లో ప్రకాష్ రాజ్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుర్లు జన్మించారు. అయితే 2009లో ప్రకాష్ రాజ్-లలిత కుమారి విడిపోయారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన రెండో భార్య పోనీ వర్మతో జీవిస్తున్నారు.

స్లైడ్ షోలో ఫోటోస్..

కూతురుతో..

కూతురుతో..

కూతురుతో కలిసి డిన్నర్ చేసిన సందర్భంగా సెల్ఫీ పోస్టు చేసిన ప్రకాష్ రాజ్.

కూతురంటే ప్రాణం

కూతురంటే ప్రాణం

కూతురంటే ప్రకాష్ రాజ్ కు ప్రాణం. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అయితే ప్రస్తుతం ఆమె తన వద్ద పెరగడం లేదు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గడుపుతూ ఉంటుంది.

మొదటి భార్య

మొదటి భార్య

తమిళ యాక్టర్ సి.ఎల్.ఆనందన్ కూతురైన లలిత కుమారి నటిగా పలు తమిళ చిత్రాల్లో నటించింది. 1994లో ప్రకాష్ రాజ్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కూతుర్లు జన్మించారు. అయితే 2009లో ప్రకాష్ రాజ్-లలిత కుమారి విడిపోయారు.

రెండో భార్య

రెండో భార్య

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన రెండో భార్య పోనీ వర్మతో జీవిస్తున్నారు.

English summary
Prakash Raj Dinner with Daughter. "Dinner with my darling daughter... The joy of growing with ur children. Blisss. Cheer" He tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu