twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 ఇయర్స్ పృథ్వికి కోర్టు షాక్: నెలకు 8 లక్షల భరణం చెల్లించాల్సిందే!

    -భార్యకు నెలకు రూ. 8లక్షల భరణం చెల్లించాలి నటుడు పృథ్విని కోర్టు ఆదేశించింది. పృథ్వి భార్య శ్రీలక్ష్మి పిటీషన్ విచారణ అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

    By Bojja Kumar
    |

    విజయవాడ: ప్రముఖ తెలుగు హాస్య నటుడు, 30 ఇయర్స్ పృథ్విగా పాపులర్ అయిన పృథ్విరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ఆయన తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పన భరణం చెల్లించాలని ఆదేశించింది.

    ఈ కేసు వివరాల్లోకి వెళ్లితే.... పృథ్వీరాజ్‌కు, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి 1984లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సినిమా రంగంలోకి రాక ముందు శ్రీలక్ష్మి కుటుంబానికి చెందిన మిఠాయి దుకాణాన్ని పృథ్వి, శ్రీలక్ష్మి కలిసి నిర్వహించేవారు. తర్వాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన పృధ్వి.... నటుడిగా నిలదొక్కుకోవడంతో కొన్నాళ్ల తర్వాత కుటుంబంతో సహా హైదరాబాద్ షిప్ట్ అయ్యారు.

    కొపురంలో గొడవలు

    కొపురంలో గొడవలు

    పృధ్వి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత, నటుడిగా బిజీ అయిన తర్వాత ఆయన చెడు వ్యసనాలకు బానిసైనట్లు తెలుస్తోది. ఈ క్రమంలోనే వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.

    భార్యను వెళ్లగొట్టిన వైనం..

    భార్యను వెళ్లగొట్టిన వైనం..

    భార్యతో తరచూ గొడవ పడే పృధ్వి 2016 ఏప్రిల్‌ 5న ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆమె విజయవాడ చేరుకున్నారు. పెద్దమనుషులు వీరి మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోలేదు.

    పృథ్వీరాజ్‌పై 498ఎ కేసు

    పృథ్వీరాజ్‌పై 498ఎ కేసు

    ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి .... 2016 నవంబర్‌ 2న సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో పృథ్వీరాజ్‌పై 498ఎ కేసు పెట్టారు. తన భర్త ఆదాయపరిస్థితి చాలా బాగుందని, తన జీవనోపాధికి అతని నుంచి నెలకు రూ.10లక్షలు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేశారు.

    లెక్కచేయని పృథ్వి...

    లెక్కచేయని పృథ్వి...

    కోర్టు ద్వారా శ్రీలక్ష్మి పంపిన సమన్లను పృథ్వీ అందుకోకపోవడంతో ఆమె హైదరాబాద్‌లో పేపర్‌ ప్రకటన ద్వారా నోటీసు ఇచ్చారు. కేసు వాయిదాలకు కూడా అతడు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి బాధితురాలికి నెలకు రూ.8లక్షలు భరణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

    English summary
    A Family Court in Vijayawada ordered Tollywood Comedian Prudhvi to pay Rs 8 lakh per month as alimony to his Wife Srilakshmi on grounds of separation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X