twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వాళ్లే నన్ను ముంచారు, మర్డర్ ప్లాన్ చేసింది నిజమే: కమెడియన్ రఘు

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలతో దూసుకెలుతున్న నటుడు రఘు కారుమంచి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొచ్చారు.

    ఇంట్లో నుండి బయటకు పంపేశారు

    ఇంట్లో నుండి బయటకు పంపేశారు

    మాది గుంటూరు జిల్లా తెనాలి. నాన్న ఆర్మీ ఆఫీసర్ కావడంతో మేము అల్వాల్‌లో ఉండేవారం. స్కూలు, కాలేజీ రోజుల్లో నా స్నేహితులంతా ఇక్కడి వారే కావడంతో తెలంగాణ యాస అలవాటు అయిపోయిందని రఘు తెలిపారు. కాలేజీ పూర్తయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో నుండి బయటకు రావాల్సి వచ్చిందని రఘు తెలిపారు.

     సెటిల్మెంట్లు చేసేవాడిని

    సెటిల్మెంట్లు చేసేవాడిని

    ఇంట్లో ఉన్నంత బుద్దుడిలా ఉండేవాన్ని, బయటకు వస్తే చుట్టూ పది మందితో చిన్న బ్యాచ్ ఉండేది. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడిని. ఈ క్రమంలో గొడవలు అయ్యేవి. ఓసారి ఇంట్లో విషయం తెలిసి సూట్ కేసు బయట పెట్టేశారు. అలా ఇంట్లో నుండి బయటకు వచ్చేశా. రెండేళ్లు ఒంటరిగా బయట ఉన్నా. తర్వాత రియలైజ్ అయి మళ్లీ ఇంటికి వెళ్లాను.... అని రఘు తెలిపారు.

     మర్డర్ ప్లాన్ ఏదో ఆవేశంలో

    మర్డర్ ప్లాన్ ఏదో ఆవేశంలో

    ఓసారి మర్డర్ ప్లాన్ చేశారట కదా అనే ప్రశ్నకు స్పందిస్తూ... నేనే ఏవీకాలేజీలో చదువుకున్నాను. స్టూడెంట్స్‌తో నేపాల్ టూర్ ఆర్గనైజ్ చేసినపుడు ఓ చిన్న గొడవ జరిగింది. అప్పుడేదో అవేశంలో అలాంటి ఆలోచనలు వచ్చాయి. తర్వాత అంతా సెట్టయింది. నా అదృష్టం బావుండి డెస్టెనీ నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లించింది అని రఘు తెలిపారు.

    రేవంత్ రెడ్డి నా క్లాస్‌మేట్

    రేవంత్ రెడ్డి నా క్లాస్‌మేట్

    పొలిటీషియన్ రేవంత్ రెడ్డి నాకు డిగ్రీ క్లాస్ మేట్. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లే.... రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. రేవంత్ అన్న కాలేజ్‌లో ఉన్నపుడు చాలా సాఫ్ట్ గా ఉండేవాడు. ఇపుడు ఆయన చాలా మారిపోయారు అని రఘు తెలిపారు.

     నా వాళ్లే నన్ను ముంచారు

    నా వాళ్లే నన్ను ముంచారు

    ఇంట్లో తెలియకుండా పార్ట్‌నర్ షిప్‌లో కొన్ని వ్యాపారాలు చేసి చాలా నష్టపోయాను. నా ఫ్రెండ్స్ వల్ల నేను బాగు పడ్డాను అని రఘు తెలిపారు. సినిమాల్లో అవకాశాలు కూడా స్నేహితుల వల్లనే వచ్చాయి. ఇక నాకు సాఫ్ట్ వేర్ కి సంబంధించి ఒక బిజినెస్ ఉండేది, అలాగే షాద్ నగర్ దగ్గర కొంత పొలం ఉండేది. నేను బాగా ఎదుగుతున్న సమయంలో నా సొంత మనుషులే దెబ్బకొట్టారు. బిజినెస్ పోయింది .. పొలమూ పోయింది... అని రఘు తెలిపారు.

     ఆత్మహత్య చేసుకుంటాని భయపడ్డారు

    ఆత్మహత్య చేసుకుంటాని భయపడ్డారు

    అదే సమయంలో షేర్ బిజినెస్ లోను నష్టాలు వచ్చాయి. ఏం చేయాలో తెలియక మూడు నెలల పాటు గదిలో నుంచి బయటికి కూడా రాలేదు. ఇద్దరు ఆడపిల్లలు .. ఏంటి పరిస్థితి అనేది అర్థం కాలేదు. మా పేరెంట్స్ నేను ఆత్మహత్య చేసుకుంటానేమో అని డౌట్ వచ్చి మా ఇంటికి వచ్చి నాతోనే ఉన్నారు. ఆ సమయంలో నా భార్య, పేరెంట్స్ చాలా సపోర్టివ్ గా నిలిచారని రఘు తెలిపారు.

    English summary
    Actor Raghu Karumanchi about his life journy. Raghu Karumanchi is an Indian actor who predominantly appears in Telugu cinema as a comedian, and supporting actor. He acted in more than 150 films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X