Just In
- 3 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 3 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 5 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపరీతమైన పెయిన్ తో..., చిరు స్పృహతప్పాడు.... : రాజా రవీంద్ర చెప్పిన తెరవెనుక కథలు
రాజా రవీంద్ర ఒకానొక సమయంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరమీద కూడా మంచి పాత్రలతో పెద్ద గుర్తింపే తెచ్చుకున్నాడు 'పెదరాయుడు' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రొడక్షన్ టీమ్‌లోకి అడుగుపెట్టిన రాజా రవీంద్ర పలువురు హీరోల డేట్స్ చూసుకునేవాడు. దాని వాళ్ళ అతను మళ్ళీ తెర వెనుకకి వెళ్ళిపోయాడు. చాలా మంది హీరోలకు ఈయన పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు.
ఇప్పటికీ రవితేజ, సునీల్, నిఖిల్ వంటి ఎందరో హీరోల డేట్లు చూసేది రాజా రవీంద్రే అన్న సంగతి చాలా మందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు వరకూ దాదాపు పదేళ్లపాటు మెగాస్టార్ తోనే ఉన్నాడు రాజా రవీంద్ర. ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో తాను చిరంజీవి తో కలిసి ఉన్నప్పటి అనుభవాలను చెప్పాడు రాజా రవీంద్ర

రాజా రవీంద్ర:
ఆ మధ్య కృష్ణవంశీ సినిమా `పైసా`లో ఓ మంచి పాత్ర వేశాడు రాజా రవీంద్ర . దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి ఇప్పట్నుంచి నేను వరుసగా సినిమాలు చేయబోతున్నా అని ప్రకటించాడు. అయితే నిర్మాతలూ, దర్శకులూ ఈ ప్రకటనని అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించ లేదు.

చిరంజీవి తో:
అంతలోనే బ్యారీజాన్ అనే హాలీవుడ్ దర్శకుడు రూపొందిస్తున్న ఓ సినిమాలో కీలకపాత్ర చేసే అవకాశం దక్కిందనీ, అందుకోసం గడ్డాలు, మీసాలు కూడా పెంచుతున్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగిందనీ చెప్పినా తర్వాత మళ్ళీ ఆ సినిమా సంగతి చడీ చప్పుడూ లేదు. అయితే ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో తాను చిరంజీవి తో కలిసి ఉన్నప్పటి అనుభవాలను చెప్పాడు రాజా రవీంద్ర

రాజకీయాల్లోకి రాకముందు:
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు వరకూ దాదాపు పదేళ్లపాటు మెగాస్టార్ తోనే ఉన్నాడు రాజా రవీంద్ర. అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ 'ఆర్టిస్టుగా ఇప్పుడున్న హీరోలు కూడా చిరంజీవి గారి దగ్గర చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ డెడికేషన్ అసలు ఎక్కడా చూడలేం.

వందల సంఘటనలు :
ఆయన అంకిత భావం గురించి చెప్పాలంటే కొన్ని వందల సంఘటనలు ఉంటాయ్. ఇవాల్టికీ ఆయన సాంగ్ అంటే రిహార్సల్ చేస్తారు. నిజానికి ఆయనకు ఆ అవసరం లేదు. సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. అసలు వేరేదేమీ బ్రెయిన్ లో ఉండదు. పొద్దున లేవగానే.. షూటింగ్ కి రాకముందే.. మొదట సీన్ పేపర్ తో ఆయన లైఫ్ స్టార్ట్ అవుతుంది' అంటూ చెప్పిన ఈ సీనియర్ ఆర్టిస్ట్ టాగూర్, జగదేక వీరుడూ అతిలోక సుందరీ సినిమాలనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

విపరీతమైన ప్యాషన్:
' సినిమా అంటే చిరంజీవి గారికి విపరీతమైన ప్యాషన్. అందుకే ఆయన 9 ఏళ్ల తర్వాత తెరమీదకి వచ్చినా అన్ని రికార్డులు కొట్టి మెగాస్టార్ అనే ఇమేజ్ ని నిలబెట్టుకున్నారు' అన్నాడు రాజా రవీంద్ర. ఆ సిన్సియారిటీని ఆడియన్స్ కూడా ఫీలవుతారు. స్క్రీన్ పై చూసినపుడు ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ మెంట్... ఆడియన్స్ కి తెలిసిపోతుంది.

కొడితే కొట్టాలిరా సాంగ్ :
చాలా మంది కష్టపడుతున్నారు సిక్స్ ప్యాక్ లు చేస్తున్నారు కానీ.. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నోరు కట్టుకోవడం చాలా కష్టం. ఠాగూర్ లో కొడితే కొట్టాలిరా సాంగ్ చేస్తున్నపుడు జరిగిన సంఘటన అసలు మర్చిపోలేం. ఆ పాట చేస్తున్నపుడు ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయనకు కార్వాన్ లోకి వెళ్లారు. డ్యాన్స్ మాస్టర్ ఏంటీ ఇంకా రాలేదు అని అడిగితే.. నేను ఆయన్ను చూడడానికి వెళ్లాను' అంటూ అప్పటి సంఘటనలు వివరించాడు రాజా రవీంద్ర.

నరకంలా ఉంటుంది:
'ఆ సమయం లోవచ్చే పెయిన్ నరకంలా ఉంటుంది. అప్పటికే చిరంజీవి విపరీతమైన నొప్పితో ఉన్నారు. డాన్స్ మాస్టర్ లారెన్స్ కు నా పెయిన్ సంగతి చెప్పద్దు.. అప్ సెట్ అవుతారు అన్నారు చిరంజీవి. ఆ పెయిన్ తో వచ్చి ఆ రోజంతా షూటింగ్ చేశారు. ఆ రోజు రాత్రే ఆ నొప్పి కారణంగా ఆయన్ను అమెరికాకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇవాళ కాదు రేపు చేస్తానంటే అడిగేవారు కూడా ఉండరు. కానీ చిరంజీవి గారు అప్పుడు కూదా పని చేయటానికి సిద్దపడ్దారు.

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో:
‘జగదేకవీరుడు.. అతిలోక సుందరి' సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు . "జగదేక వీరుడు.. అతిలోక సుందరి" సినిమాలో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట షూటింగ్ జరగాల్సి ఉంది అయితే ఆ సమయం లో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. కానీ అలాగని షూటింగ్ ఆపే వీలు లేకపోయింది.

అంత జ్వరంతోనూ:
ఎందుకంటే ఆ రోజు షూట్ ఆలస్యమైతే శ్రీదేవి డేట్స్ పోతాయి, నిర్మాతకి నష్టం వస్తుంది... అంతే కాదు మళ్ళీ శ్రీదేవి డేట్లు ఎప్పటికి కుదురుతాయో తెలియదు అప్పుడు మళ్ళీ డేట్ల విషయం లో గందరగోళం తప్పదు. అందుకే ఆయన అంత జ్వరంతోనూ పాట షూటింగ్‌కు వచ్చారు. ఆ పాట షూటింగ్ సమయమంతా చిరంజీవికి జ్వరం తగ్గలేదు. దాంతో చివరిరోజు ఆయన షూటింగ్ స్పాట్‌లోనే నిలబడ్దవాడు నిలబడ్డట్టుగానే స్పృహ కోల్పోయి పడిపోయారు.

హాస్పిటల్‌కు తరలించారు:
వెంటనే ఆయణ్ని హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. రెండు రోజుల వరకు ఆయన కళ్లు తెరవలేదు. అంత డెడికేషన్ ఇప్పటి హీరోలెవరిలోనూ నాకు కనబడలేద'ని రాజా రవీంద్ర చెప్పాడు. అవును మరి అంతటి డెడికేషన్ ఉండటం వల్లే చిరు ఇప్పుడు ఆ స్థానం లో ఉన్నాడు.