హీరో రాజశేఖర్ ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సంచలనం.. విడుదలకు ముందే రికార్డు..
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధగా రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో పీఎస్‌వీ గరుడ 126.18ఎం చిత్రం రూపొందుతున్నది.
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధగా రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో పీఎస్‌వీ గరుడ 126.18ఎం చిత్రం రూపొందుతున్నది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రాజశేఖర్ అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మెప్పించడంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాపై పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిని చూపిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్‌లో వాల్‌పోస్టర్ సినిమా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

పూజా కుమార్ గృహిణి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ప్రత్యేకమైన పాట్ హడలగొట్టినట్టు తెలుస్తున్నది. శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. అదిత్ ఈ చిత్రంలో టెక్నిషియన్ పాత్రలో నటిస్తున్నాడు. మెయిన్ విలన్‌గా కిషోర్ నటిస్తున్నాడు. నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











