twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆసుపత్రి నుంచి రాజేంద్రప్రసాద్ డిశ్చార్జి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆసుపత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. వైద్యులు ఆయనకు ఆంజియో ప్రాస్టీ సర్జరీ చేసారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ పూర్తిగా కోలుకున్నారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు.

    చాతీ నొప్పి రావడంతో రాజేంద్రప్రసాద్‌ను సోమవారం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. చికిత్స పూర్తి కావడంతో ఆయన్ను ఇంటికి పంపించారు. ఆయన వెంట కూతరు, కొడుకు ఉన్నారు. రాజేంద్రప్రసాద్ కోలు కోవడంతో ఆయన్ను పరామర్శించడానికి పలువరు ప్రముఖులు, స్నేహితులు, బంధువులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

    డా.రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో క్రాంతిమాధవ్ స్వీయ దర్శకత్వంలో 'ఓనమాలు' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఒక మంచి ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా నటించారు రాజేంద్రప్రసాద్. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవం రోజే నటకిరీటి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం గమనార్హం.

    రాజేంద్రప్రసాద్.. నారారణరావు మాస్టారిగా చేసిన ఈ చిత్రంలో పల్లెటూరి ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ 'డ్రీమ్', 'నూతిలో కప్పలు' అనే చిత్రాలు చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో పోల్స్టార్ పిక్చర్స్ పతాకంపై చంటి జ్ఞానమణి దర్శకత్వంలో వినయ్, పూనాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నూతిలో కప్పలు' (పైకి రావు, రానివ్వవు). పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Actor Rajendra Prasad was discharged from hospital Wednesday morning after two days of medical care. "His health condition is much better now and the doctors have confirmed that hes fit to go home. Theres absolutely no need to worry and he will resume work soon," the actors secretary Naga Raju told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X