»   » రామ్ చరణ్ ఇంట్లో విందు వివాదం...పోలీస్ కేసు

రామ్ చరణ్ ఇంట్లో విందు వివాదం...పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్ ఇంటి వద్ద తన ఫ్రెండ్స్ కు ఇచ్చిన విందు వివాదానికి దారి తీసి పోలీస్ కేసు నమోదు చేసేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లో నివశించే రామ్ చరణ్ తన నివాశంలోని టెర్రస్ పై శనివారం రాత్రి తన స్నేహితులకు విందు ఇచ్చారు. ఆ విందు శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం తెల్లవారు ఝాము వరకూ సాగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విందులో ఎమ్మల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నారు. వారు అరుపులతో,కేకలతో స్దానికులకు చిరాకు కలిగించారు. ఆ ఇంటి ప్రక్కనే నివాసం ఉంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100 కి ఫోన్ చేసి పోలీస్ లకు సమాచారం అందించారు.

దాంతో కాస్సేపటకి జూబ్లిహిల్స్ ఎస్ ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని విందు కార్యక్రమాన్ని ఆపేయాలని కోరగా అందుకాయన నిరాకరించారు. దీనిపై పోలీసులుకు కేసుని నమోదు చేసినట్లు సమాచారం. ఈ వార్త అన్ని పత్రికల్లో ప్రముఖ టాలీవుడ్ హీరో...వివాదం అంటూ నిన్న చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Actor Ram Charan’s Saturday night fever angers neighbours

ఇన్‌స్పెక్టర్‌ సామల వెంకటరెడ్డి కథనం మేరకు...జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.25లోని చిరంజీవి నివాసంనుంచి భారీగా సంగీతహోరు బయటకు వస్తోంది. సమీపంలో ఉన్న ఐపీఎస్‌ అధికారి గౌతం సవాంగ్‌ ఈ శబ్దాలకు మేల్కొని.. ఉదయం 4.30గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. కొందరు యువకులు న్యూసెన్స్‌ చేస్తున్నారంటూ వివరించారు. విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్‌ నేరపరిశోధన విభాగం ఎస్సై రమేష్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు.

అప్పటికే చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్‌ ఇంటి ముందుగేటు వద్దకు వచ్చారు. ఆయనతోపాటు ఇంటి టెర్రస్‌పైన మరో నలుగురు యువకులున్నారు. వీరిలో మాజీ ఎంపీ కుమారుడు, గ్రేటర్‌ పరిధిలోని తెరాస ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము సాధారణ దైనందిని (జనరల్‌ డైరీ- జీడీ ఎంట్రీ)లో నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ సామల వెంకటరెడ్డి వివరించారు.

రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే...

రామ్ చరణ్ ఇంకోటి కమిటయ్యారని సమాచారం. శ్రీను వైట్ల చిత్రం హడావిడిలో ఉన్న రామ్ చరణ్ ... రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు సురేందర్‌రెడ్డితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు టాక్స్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ని కలిసి సురేందర్‌రెడ్డి కథ కూడా వినిపించినట్లు చెప్పుకుంటున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దానికి సైతం వక్కంతం వంశీ కథ అందిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం చరణ్‌, శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యూలర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభిస్తారని చిత్ర యూనిట్‌ తెలిపారు. చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ ను హీరోయిన్ న్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అనంతరం సురేంద్రరెడ్డితో చిత్రం ఉంటుంది.

ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్‌ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

English summary
Disturbed neighbours had to call the police after Tollywood actor Ram Charan and his friends allegedly made a ruckus in the early hours of Sunday by hooting and shouting. A top bureaucrat living in the neighbourhood at Jubilee Hills dialled 100 and the police reached the spot and warned the revellers — who included sons of two prominent politicians — and asked them to disperse.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu