»   » కోట్లు ఖర్చు పెట్టి విజయ్ మాల్యా ఇంటిని కొన్న టాలీవుడ్ హీరో!

కోట్లు ఖర్చు పెట్టి విజయ్ మాల్యా ఇంటిని కొన్న టాలీవుడ్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'మౌనమేలనోయి' సినిమా ద్వారా తెలుగులో హీరోగా కెరీర్ మొదలు పెట్టి... 'నిను చూడక నేనుండలేను', 'ఒరేయ్ పండు', 'మొగిలి పువ్వు' లాంటి చిత్రాల్లో నటించిన హీరో సచిన్ జోషి. సచిన్ జోషి పుట్టి పెరిగింది ముంబైలో అయినా... తెలుగులో హీరోగా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్ హీరోగా మారిపోయాడు. ఇప్పటి వరకు అతడు ఎక్కువ సినిమాలు చేసింది కూడా తెలుగులోనే.

సచిన్ జోషికి సినిమాలే ప్రధాన వృత్తి కాదు... హోటల్, రిసార్ట్స్, పవర్ ప్లాంట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. సచిన్ జోషి ఆస్తులు కూడా వేల కోట్లలోనే ఉంటాయి. అలాంటి భారీ ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్ ఉన్న సచిన్ జోషికి 73 కోట్లు పెట్టి ఓ భవనం కొనడం పెద్ద విషయం ఏమీ కాదు.

విజయ్ మాల్యా విల్లా

విజయ్ మాల్యా విల్లా

గోవాలోని విజయ్‌మాల్యా విల్లా నటుడు సచిన్‌జోషి సొంతం చేసుకున్నాడు. గోవాలోని అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మాల్యా విల్లాను పలుమార్లు వేలానికి ఉంచగా ఎవరూ కొనుగోలు చేసేంందుకు ముందుకు రాలేదు. చివరిసారిగా వేలానికి ఉంచిన రిజర్వు ధర రూ.73కోట్లు చెల్లించేందుకు జోషి అంగీకరించారు. ఈ విషయాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ అరుంధతి భట్టాఛార్య ధ్రువీకరించారు.

మూడు సార్లు వేలానికి ఉంచగా

మూడు సార్లు వేలానికి ఉంచగా

విజయ్‌మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లకుపైగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. అతడికి రుణాల ఇచ్చిన బ్యాంకులు అతడికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నాయి. అందులో భాగంగానే గోవాలోని విల్లాను వేలం వేసారు. ఇప్పటికే మూడు సార్లు వేలం వేసి ఎవరూ కొనలేదు. చివరకు సచిన్ జోషి మార్చిలో ఈ విల్లాను సొంతం చేసుకున్నాడు.

హోటల్ వ్యాపారం

హోటల్ వ్యాపారం

ఈ భవంతిని హోటల్ వ్యాపారినిక లేదా సినిమా షూటింగుల కోసం రెంటుగా ఉపయోగించాలనే ఉద్దేశ్యంతోనే సచిన్ జోషి దీన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గేల్ ఆ విల్లా గురించి

గేల్ ఆ విల్లా గురించి

క్రికెట్ తో పాటు పార్టీలంటే ప్రత్యేకమైన ఆసక్తి చూపే ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' ఆటగాడు క్రిస్ గేల్...తన ఆటోబయోగ్రఫీ ‘సిక్స్ మెషీన్: ఐ డోన్ట్ లవ్ క్రికెట్, ఐ లవ్ ఇట్' లో... గోవాలోని మాల్యా విల్లా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అది స్టార్ హోటళ్ల కంటే చాలా పెద్దదని, మరో మాటలో చెప్పాలంటే ఓ రాజప్రాసాదం అని గేల్ వర్ణించాడు. ఐపీఎల్ లో ఏ మాత్రం బ్రేక్ దొరికినా వెంటనే తాను గోవా ఫ్లైటెక్కి మాల్యా విల్లాలో వాలిపోయేవాడిని గేల్ చెప్పాడు. ఆ క్రమంలో ఓ సారి ఐదు రోజుల పాటు ఆ విల్లాలో తాను ‘రాజు'లా ఎంజాయ్ చేశానని గేల్ వివరించాడు. ఆ సమయంలో తాను స్వర్గం చూశానన్నాడు.

English summary
After three failed auctions, banks have finally managed to sell the Kingfisher Villa in Goa belonging to businessman Vijay Mallya to actor-producer Sachiin Joshi for Rs 73 crore through a private treaty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu