»   » నేనైతే ముప్పైసార్లు చనిపోవాలి, ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై శివాజీ

నేనైతే ముప్పైసార్లు చనిపోవాలి, ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై శివాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిల్మ్ చాంబర్లో సందర్శనార్థం ఉంచిన ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పించేందుకు తెలుగు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ...జీవితంలో కష్టాలు, నష్టాలు సహజం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి...కానీ ఆత్మహత్య చేసుకుని తప్పుకునే ప్రయత్నం చేయెద్దని వ్యాఖ్యానించారు.

ఉదయ్ కిరణ్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించిన శివాజీ.....నేను కూడా కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎదుర్కొంటూనే ఉన్నాను. ఆ విధంగా చూస్తే నేను ఇరవై ముప్పైసార్లు చనిపోవాలి అని శివాజీ వ్యాఖ్యానించారు. చనిపోతే మనల్ని నమ్ముకున్న దిక్కులేని వారవుతారు, 17 ఏళ్లవుతుంది నేనోచ్చి, భగవంతుడి ప్రతి మనిషిని గెలిపిస్తాడు, తల్లిదండ్రులకు అన్యాయం చేయోద్దు అన్నారు.

Shivaji

పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, ఈ విధంగా చేయడం సరికాదు అన్నారు. గుండు హనుమంతరావు మట్లాడుతూ...ఉదయ్ కిరణ్ మృతి ఎంతో బాధ పెట్టింది. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ....సమస్యలు ఉంటే స్నేహితులతో చెప్పుకోవాలి, తనలో తానే కృంగిపోయి ఇలా చేయడం సరికాదన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...33 సంవత్సరాల యువకుడు ఆత్మసంఘర్షణకు లోనయ్యాడంటే ఎన్ని బాధలు అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. జయసుధ మాట్లాడుతూ...సూసైడ్ సరైన చర్యకాదు, ఆయన మృతి విషయం తెలియగానే కన్నీళ్లు ఆగలేదు అన్నారు.

English summary
Reacting to the untimely death of Telugu actor Uday Kiran, who committed suicide here Sunday, celebrities like Shivaji, Srikanth, Paruchuri brothers shared their condolences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X