twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసులు నన్ను వేధించారు: శివబాలాజీ

    By Srikanya
    |

    Siva Balaji
    మొన్న శనివారం త్రాగి డ్రైవింగ్ చేస్తూ నటుడు శివబాలాజీ పోలీసులుకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పోలీసులు తన కారు తనకు ఇవ్వటానకి చాలా ఇబ్బంది పెట్టారని,హెరాస్ చేసారని ఆయన పాపులర్ ఇంగ్లీష్ డైలీకి చెప్పుకొచ్చారు. మీడియా వాళ్లు వచ్చే వాళ్ల ఎదురుగుండానే కారుని,తాళాలను తీసుకోవాలని వారు పట్టుబట్టారని అన్నారు. అలాగే తన చేత మెసేజ్ చెప్పించాలని ప్రయత్నించారని అన్నారు.

    ఆయన మాటల్లోనే.. నేను శనివారం ఆల్కహాల్ త్రాగి పట్టుబడిన తర్వాత ..నన్ను పోలీసులు మా ఇంటిదగ్గర దింపేసారు. వెహికల్ ని స్టేషన్ కి తీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఇన్సెపెక్టర్ వి. సూర్య చంద్రరావు నాకు ఫోన్ చేసి హెరాస్ చేసారు. ఆ రాత్రి నాకు పోన్ చేసి మీ కారు తీసుకుపోండని చెప్పారు. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి అక్కడ మీడియా అంతా గుమిగూడి ఉంది. నేను అతన్ని మీరు మీడియాను పిలిచారా అంటే లేదని సమాధానమిచ్చాడు. అ తర్వాత నేను మంగళవారం నాడు నేను కోర్టుకి వెళ్లి ఫైన్ కట్టి, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చినా కారు నాకు ఇవ్వలేదు. నాలుగున్నరకి స్టేషన్ కి వెళ్లితే ఏడు గంటలు దాకా వెయిట్ చేయించారు. నన్ను అక్కడ వెయిట్ చేయమని కానిస్టేబుల్స్ చెప్పారు. నిజానకి ఫైల్ మీద సంతకం పెట్టించుకుని,కారు కీస్ నాకు హేండోవర్ చెయ్యొచ్చు..కానీ అలా చేయకుండా వెయిట్ చేయించారు. బయిటకు వెళ్లిన ఇన్సెపెక్టరు వచ్చేసరికి మీడియా మొత్తం స్టేషన్ బయిట గుమి గూడి ఉంది అన్నారు. ఇక ఈ విషయమై ఇన్సెపెక్టర్ సూర్యచంద్రరావు ఖండిచారు. తాను మీడియాను అస్సలు పిలవలేదని, ప్రస్టేషన్ తోనే ఆయన ఇలా మాట్లాడి ఉండవచ్చు అని అన్నారు.

    English summary
    Siva Balaji, who was caught driving under the influence of alcohol by the traffic police, has complained that he was harassed by the Jubilee Hills police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X