»   » నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కాటమరాయుడు' సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న శివ బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ఎఫ్‌బి అకౌంట్ ద్వారా వెల్లడించారు.

మనకు ఒక వయసు వచ్చిన తర్వాత.... పుట్టినరోజు వేడుకలు చిన్నతంలో, లేదా టీనేజీలో లాగా ఎగ్జైట్మెంట్ అనిపించవు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలాంటి పీల్ వస్తుంది. ఈ సారి నా బర్త్ డే సందర్భంగా చాలా ఎగ్జైట్ అయ్యాను. అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారే, ఆయనకు కృతజ్ఞతలు... అంటూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అంటూ...

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అంటూ...

పవన్ కల్యాణ్ గారు లొకేషన్ కి వచ్చారు. వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సర్ అన్నాను. ఆ... శివా అనేంతలో, దర్శకులు డాలీ, పవన్ కల్యాణ్ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్ అని చెప్పారు. వెంటనే పవన్ గారు నా భుజం మీద చెయ్యవేసి నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అంటూ ప్రొడక్షన్ అని పిలిచారు... వెంటనే ప్రొడక్షన్ చీఫ్ ఆయన ముందు హాజరయ్యారు.

ఏం శివా బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చుతుందా

ఏం శివా బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చుతుందా

ప్రొడక్షన్ చీఫ్ తో నాకొక కేక్ కావాలి.. పెద్దదిగా ఉండాలి... ఏం శివా బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చుతుందా? అన్నారు.... నేను అలాగే కళ్ళప్పగించి ఎస్ సార్ అన్నాను.... కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్, నా భార్య మధుని పిలవచ్చా అని అడిగాను... పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రమ్మనవోయ్ అన్నారు.

మాటలలో చెప్పలేని మహదానుభూతి

మాటలలో చెప్పలేని మహదానుభూతి

పవన్ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో, నా పుట్టినరోజునాడు ఆయన నాకిచ్చిన విలువ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని , మాటలలో చెప్పలేని మహదానుభూతి అని శివ బాలాజీ చెప్పుకొచ్చారు.

దర్శకుడికి పెద్ద థాంక్స్

దర్శకుడికి పెద్ద థాంక్స్

ఈ నా పుట్టినరోజును జీవితంలో ఎప్పటికీ మరిచిపోని మధురానుభూతిగా నిలిపిన దర్శకుడు డాలీకి టన్నుల కొద్దీ థాంక్స్ అని శివబాలాజీ వ్యాఖ్యానించారు.

English summary
"Thanks to PawanKalyan garu for arranging the Birthday event and celebrations at Katamarayudu set and much more thanks for his time spent with my family." Actor Sivabalaji said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu