twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో రంగ‌నాథ్ మ‌ర‌ణ‌మే కార‌ణం.. యాక్సిడెంట్ తర్వాత ప్రస్తుత నా జీవితం బోనస్

    |

    Recommended Video

    Sivaji Raja Superb Speech At His Birthday Celebrations | Filmibeat Telugu

    ప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న న‌టుడిగా శివాజీ రాజా సుప‌రిచితం. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించిన అనుభ‌వ‌జ్ఞుడు. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నో ప్ర‌యోజ‌న‌కర కార్య‌క్ర‌మాల్ని అమ‌ల్లోకి తెచ్చి స‌క్సెస్ చేయ‌డంపై టాలీవుడ్ స‌హా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పేద క‌ళాకారుల కుటుంబాల్లోని పిల్ల‌ల కోసం విద్యా ల‌క్ష్మి, క‌ళ్యాణ ల‌క్ష్మి వంటి ప‌థ‌కాల్ని ప్ర‌వేశ పెట్టారు. 35 మందికి వృద్ధుల‌కు ఫించ‌న్ రూ.5000కు పెంచి అంద‌రి మెప్పు పొందారు. ప్ర‌స్తుతం ఓల్డేజ్ హోమ్ (వృద్ధాశ్ర‌మం) నిర్మాణం, మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణ‌మే ధ్యేయంగా ఆయ‌న ప‌ని చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు.

    ప్రస్తుత నా జీవితం బోనస్

    ప్రస్తుత నా జీవితం బోనస్

    నాకు పుట్టిన‌ రోజులు చేసుకునే అల‌వాటు లేదు. 32 ఏళ్ల‌ కెరీర్‌లో ప‌రిశ్ర‌మ‌లో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బ‌ర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే బ‌ర్గ్ డే. ఈసారి మ‌రిన్ని మంచి పనుల గురించి చెప్పేందుకు ఇదో వేదిక‌.
    ఇక్క‌డ పుట్టినందుకు ఎవ‌రికైనా దానం చేయ‌డం.. సాయం చేయ‌డం అనేదే చేస్తున్నా. చివ‌రి 16 ఏళ్ల జీవితం బోన‌స్. యాక్సిడెంట్ త‌ర్వాత జీవితం అంతా బోన‌స్ కిందే లెక్క‌. మంచి చేయ‌డ‌మే నా ప‌ని. దానికోసం ఏదైనా చేస్తాను.

    మా అధ్య‌క్షుడిగా రెండేళ్లుగా

    మా అధ్య‌క్షుడిగా రెండేళ్లుగా

    మా అధ్య‌క్షుడిగా రెండేళ్లు పూర్త‌యింది. ఆర్టిస్టులంతా మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఉండాల‌ని కోరారు. అయితే నేను ఉండ‌ను.. ఎవ‌రైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్క‌సారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు. మా అసోసియేష‌న్ సిల్వ‌ర్ జూబ్లీ సంవ‌త్స‌రం ఇది. ఏ గొడ‌వ‌లు లేకుండా సంతోషంగా మా సాగాలి. క‌ళాకారులు న‌న్ను ఎంత గౌర‌వంగా ఎన్నుకున్నారో అంతే గౌర‌వంగా చూసుకుంటాను అని అన్నారు.

     నా గురించి చెడుగా చెబితే

    నా గురించి చెడుగా చెబితే

    నా రెండేళ్ల పాల‌నలో ఒకే ఒక్క‌టి. నా గురించి చెడుగా చెప్ప‌డం. క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయ‌ప‌డే త‌త్వం నాది. ర‌క‌ర‌కాల సేవ‌లు చేసాను. కానీ ఎంతో సేవ చేస్తుంటే.. దానిపై కామెంట్లు చేయ‌డం బాధ అనిపించింది. ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఆండాల‌ని కోరుకుంటాను. ఈసారి త‌నీష్, ఖయూమ్ లాంటి యువ‌కులు మా ప్యానెల్ లో పోటీ చేస్తున్నారు. భ‌విష్య‌త్ త‌రం బావుండాల‌నే ప్ర‌య‌త్న‌మిది.

    ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ప్రయత్నం

    ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ప్రయత్నం

    ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇప్ప‌టికే ఓ ఎన్నారై ఆరు ఎక‌రాల భూమిని దాన‌మిస్తాన‌ని అన్నారు. అలాగే శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలో ప‌ది ఎక‌రాలు ఇచ్చేందుకు వేరొక వ్య‌క్తి సిద్ధంగా ఉన్నారు. వాటి నుంచి ఎంపిక చేసుకుని చేయాల్సి ఉంది. అలాగే ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి వెట‌ర‌న్ హీరో, ద‌ర్శ‌కుడు రంగ‌నాథ్ మ‌ర‌ణ‌మే కార‌ణం. ఆయ‌న చివ‌రి రోజుల గురించి మీకు తెలిసిందే.

    అనుభవంతో ఏదైనా చేయగలం

    అనుభవంతో ఏదైనా చేయగలం

    మూవీ ఆర్టిస్టుల సంఘం త‌ర‌పున ప‌ని చేస్తూ ఆర్టిస్టుగానూ నటించ‌వ‌చ్చు. 24 గంట‌ల స‌మ‌యం ఉంది మ‌న చేతిలో. రెండుసార్లు ఈసీ మెంబ‌ర్ గా, రెండు సార్లు ట్రెజ‌ర‌ర్ గా, రెండు సార్లు ఉపాధ్య‌క్షుడిగా, రెండుసార్లు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా, ఒక‌సారి అధ్య‌క్షుడిగా ప‌ని చేశాను. ఇంత అనుభ‌వంతో నేను ఏదైనా మంచి చేయ‌గ‌ల‌ను. ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌గ‌ల‌ను. నా చుట్టూ పాజిటివ్‌గా ఉండేవాళ్ల వ‌ల్ల‌నే నేను ఎంతైనా చేస్తాను.

    గోల్డేజ్ హోమ్ విరాళాల దాతలు వీరే

    గోల్డేజ్ హోమ్ విరాళాల దాతలు వీరే

    గోల్డేజ్ హోమ్(ఓల్డేజ్ హోమ్) కోసం రెండు స్థ‌లాలు పరిశీల‌న‌లో ఉన్నాయి. 10 ఎక‌రాలు ఓచోట‌, 6 ఎక‌రాలు ఓ చోట చూశాం. వీటిలో ఫైన‌లైజ్ చేస్తాం. ఈ గోల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ఇప్ప‌టికే విరాళాలు అందాయి. నాగినీడు - 1ల‌క్ష‌, శ్రీ‌కాంత్ -1.16ల‌క్ష‌లు, శివాజీ రాజా -1.16 ల‌క్ష‌లు, సురేష్ కొండేటి- 50 వేలు, ఏడిద శ్రీ‌రామ్ -50 వేలు, బెన‌ర్జీ- 50వేలు, గురురాజ్ -1ల‌క్ష‌, ఉత్తేజ్ -10,116 డొనేట్ చేశారు. ఇంకా ఎంద‌రో ఆర్టిస్టులు డొనేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దీని కోసం ఎంతో సాయం చేస్తున్నారు. ముందుగా మా అసోసియేష‌న్ సొంత భ‌వంతిని నిర్మిస్తాం అని శివాజీ రాజా అన్నారు.

    English summary
    MAA President Sivaji Raja celebrated his birthday on Feb 25th. In this occassion, He spoke to media. He explained his services as Maa President.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X