Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో శివాజీ ఆమ్ ఆద్మీ టర్న్...(ఫోటోలు)
హైదరాబాద్: హీరో శివాజీ ఆమ్ ఆద్మీ టర్న్ తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడు అని అర్థం. పాలెం వోల్వో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు మద్దుతుగా నిలిచారు. నేనొక సామాన్యుడిని....నా తోటి సామాన్యులు పడుతున్న బాధలు నాకు తెలుసు. అందుకే వారు చేస్తున్న ఆందోళనలో పాలు పంచుకుంటున్నాను అంటూ గళమెత్తారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శంగా ఆయన ఈ విధంగా టర్న్ అయ్యారని స్పష్టమవుతోంది. రవాణా శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని...ప్రభుత్వం, అధికారుల అవినీతి కారణంగానే ఇలాంటి బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు చేసారు శివాజీ.
వాస్తవానికి శివాజీ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చిన్న హీరో......కానీ సినిమా ఇండస్ట్రీలోని ఏ పెద్ద హీరో కూడా చేయలేని ఒక మంచి టర్న్ తీసుకున్నారు శివాజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి, రవాణా శాఖ మంత్రి తదితరులపై శివాజీ సందించిన విమర్శల బాణాలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.
వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని శివాజీ హెచ్చరించారు. ఈ నెల 15 లోగా సర్కారు స్పందించాలని...లేకుంటే 16వ తేదీన ఆమరణ దీక్షకు దిగుతానని తెలిపారు. స్లైడ్ షోలో శివాజీ ప్రెస్ మీట్ ఫోటోలు, వివరాలు...

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన శివాజీ
పలు ప్రైవేటు బస్సులు సరైన భద్రత నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నాయని, అలాంటి బస్సులను కట్టడి చేయలేని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ముమ్మాటికీ సర్కారు హత్యే అని శివాజీ ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం సాయం ఇంతేనా?
ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష పరిహారంతో బాధితుల కుటుంబాలు ఎన్నాళ్లు జీవిస్తాయని శివాజీ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే పని చేస్తున్నాయని, రాజకీయాలు పక్కనపెట్టి బాధితులకు చేకూత అందించడానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

నామాన్యుడిగా వచ్చా..
నేనొక నామాన్యుడిగా ఇక్కడకు వచ్చా...రేపు నాకూ ఇలాంటి అన్యాయం జరుగొచ్చు...అందుకే మానవత్వంతో వచ్చా... ఇంత మంది బాధ పడుతుంటే చూడలేక వచ్చా....అందరూ బాగుండాలనేదే తన ఆకాంక్ష అని శివాజీ చెప్పుకొచ్చారు.

ఈ పోరాటంలో జైలుకు వెళ్లినా డోట్ కేర్
పర్సనల్‌గా నేను వారికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయక పోయినా....వారి తరుపున పోరాడటానికి సిద్దంగా ఎన్నానని, ఈ పోరాటంలో తాను జైలుకు వెళ్లడానికైనా సిద్దమని శివాజీ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద కల్వర్టును ఢీకొట్టి నిప్పంటుకోవడంతో గాఢ నిద్రలో ఉన్న ఆ బస్సులోని 46 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.