»   » హీరో శ్రీకాంత్ ఇంటిపై దాడి, కారు ధ్వంసం...

హీరో శ్రీకాంత్ ఇంటిపై దాడి, కారు ధ్వంసం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు హీరో శ్రీకాంత్ ఇంటిపై దాడి జరిగింది. వెంకటేష్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించి ఆయన బిఎండబ్ల్యు కారుతో పాటు, ఐ టెన్ కారును ధ్వసం చేశారు. శ్రీకాంత్ మీద కూడా దాడికి ప్రయత్నింగా సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం.

ఈ సంఘటనతో సినీ ప్రముఖులంతా షాకయ్యారు. శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ఎవరు? సంఘటన వెనక అసలు కారణం ఏమిటి అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి పేరు కర్పూలుకు చెందిన వెంకటేష్ అని, గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ పలువురి ఇంట్లో వంట పని చేస్తూ జీవితస్తున్నాడని గుర్తించారు.

Actor Srikanth's House Attacked by former cook

శ్రీకాంత్‌ ఇంట్లో వెంకటేష్ 3 నెలలు పనిచేశాడు, అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో పనిలో నుంచి తొలగించారు. తర్వాత వెంకటేష్ పలుమార్లు శ్రీకాంత్‌ను కలిసేందుకు ప్రయత్నించారని, శ్రీకాంత్ కలవక పోవడంతో దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించాడని సమాచారం.

శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసిన వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి మధ్య గొడవ ఏమిటి? దాడి చేయడానికి గల కారణం ఏమిటి? అని అతడి నుండి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Actor Srikanth's House Attacked by former cook Venkatesh. Two cars were damaged in the incident. Police registered a case against Venkatesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu