మళ్లీ పెళ్లిపీటలు ఎక్కుతున్న సుమంత్.. పెళ్లి కూతురు ఎవరంటే.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డులు వైరల్
అక్కినేని నట వారసుడు సుమంత్ యార్లగడ్డ మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సినీ నటి కీర్తీ రెడ్డితో విడాకుల తర్వాత సుమంత్ కొద్ది సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుమంత్ అలియాస్ సుమంత్ కుమార్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. తాజాగా సుమంత్ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. సుమంత్ మ్యారేజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సుమంత్ తొలి వివాహం
సుమంత్ యార్లగడ్డ విషయానికి వస్తే.. సినీ హీరోయిన్ కీర్తి రెడ్డితో తొలి వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. అయితే కీర్తిరెడ్డి, సుమంత్ మధ్య స్నేహపూర్వక బంధం కొనసాగుతూనే ఉంది.

సుమంత్ మరోసారి ప్రేమ పెళ్లి
అయితే సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న సుమంత్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. పవిత్ర అనే తన సన్నిహితురాలిని వివాహం చేసుకోబోతున్నారు. అయితే తన పెళ్లి వేడుకను ప్రైవేట్ కార్యక్రమంగా, కుటుంబ వేడుకగా కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరుపాలని నిర్ణయించుకొన్నారు.

కాబోయే భార్య పవిత్ర ఎవరంటే..
సుమంత్ పెళ్లి చేసుకోనే పవిత్ర తన కుటుంబానికి చెందిన వారే. పవిత్ర ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా సుమంత్‌కు పవిత్ర బాల్య స్నేహితురాలు. ఇద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకొన్నారు అనే విషయం సన్నిహితుల ద్వారా తెలిసింది. పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డులు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులకు మాత్రమే ఇచ్చి ఆహ్వానించారు. ఎలాంటి హంగుల లేకుండా ఈ పెళ్లిని నిర్వహించాలని నిర్ణయించారు.

వెడ్డింగ్ కార్డులు వైరల్
సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అనే ఉన్న వెడ్డింగ్ కార్డులో వేదిక వివరాలు కనిపించకుండా ఉన్నాయి. సుమంత్ పెళ్లి, ఎప్పుడు ఎక్కడ అనేది గోప్యంగా ఉంచడంతో అక్కినేని అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ పెళ్లిపై ఆసక్తి పెరిగింది. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Recommended Video

సుమంత్ కుమార్ యార్లగడ్డ కెరీర్ ఇలా
సుమంత్ కెరీర్ విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమకథ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. యువకుడ, పెళ్లి సంబంధ, స్నేహమంటే ఇదేరా, సత్యం, గౌరి, గోదావరి, మధుమాసం, మళ్లీరావా, కపటధారి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











