Don't Miss!
- News
Lady: ప్రతీకారం, 58 ఏళ్ల ఆంటీని రేప్ చేసి చంపేసిన 16 ఏళ్ల అబ్బాయి, పగతో ప్రైవేట్ పార్ట్స్ ను వదల్లేదు !
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రముఖ నటుడు మృతి.. సంతాపం తెలుపుతున్న ఇండస్ట్రీ ప్రముఖులు
బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు స్వరూప్ దత్ (78) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం రోజు తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

వృద్ధాప్య సంబంధిత వ్యాధి కారణంగా
నటుడు స్వరూప్ దత్ కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. గత శనివారం ఆయన ఆపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బుధవారం ఉదయం స్వరూప్ దత్ తుది శ్వాస విడిచారు.

1960 దశకంలో..
స్వరూప్ దత్ ఎన్నో బెంగాలీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 1960 దశకంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. తపన్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'అపంజన్' అనే సినిమా ఆయన కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో బెంగాలీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు స్వరూప్ దత్.

బెంగాలీ గొప్ప నటుల్లో ఒకడిగా
ఉత్పల్ దత్‌ను స్ఫూర్తిగా పొంది నాటకాల్లో నటించిన స్వరూప్ దత్.. ఆ తర్వాత చాలా కాలంపాటు రంగస్థల నటుడిగా కొనసాగారు. 'సగిన మహటో', 'హర్మోనియం', 'పితా పుత్ర అండ్ మా ఓ మేయే' వంటివి ఈయన చేసిన ప్రముఖ చిత్రాలు. బెంగాల్ భాషలో గొప్ప నటుల్లో ఒకడిగా కీర్తి గడించారు స్వరూప్ దత్.

కొడుకు, భార్య.. పలువురి సంతాపం
స్వరూప్ దత్ కి భార్య, ఒక కొడుకు అన్నారు. అతని కొడుకు షరన్ దత్ కూడా నటుడే. విభిన్నమైన పాత్రలు పోషించి బెంగాలీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా స్వరూప్ దత్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తమ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. గురువారం సాయంత్రం ఆయన అంతిమయాత్ర జరగనుందని సమాచారం.