»   » అపుడు బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు డ్రగ్స్: హీరో తరుణ్ ఆవేదన (వీడియో)

అపుడు బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు డ్రగ్స్: హీరో తరుణ్ ఆవేదన (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విషయంలో తాను సిట్ విచారణకు హాజరయ్యానని, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని హీరో తరుణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.

ఈ కేసు విషయంలో తనపై మీడియాలో జరుగున్న ప్రచారంతో కుటుంబం బాధ పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ తరుణ్ ఈ సందర్భంగా మీడియాను రిక్వెస్ట్ చేశారు. మీలాగే తనకూ కుటుంబం ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని తరుణ్ తెలిపారు.

గౌరవం ఉంది

గౌరవం ఉంది

డ్రగ్స్ కేసు విషయంలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. న్యాయ వ్యవస్థమీద, నన్ను విచారించిన అకున్ సబర్వాల్, సిట్ ఆఫీసర్స్ మీద రెస్పెక్ట్ ఉందని హీరో తరుణ్ వ్యాఖ్యానించారు.

కలిసి కట్టుగా ఫైట్ చేద్దాం

కలిసి కట్టుగా ఫైట్ చేద్దాం

డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదు. డ్రగ్స్ వాడకం సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని అంతా వింటున్నాం. ఒక బాధ్యత గల పౌరులుగా దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తరుణ్ తెలిపారు.

నా గురించి దారుణంగా రాశారు

నా గురించి దారుణంగా రాశారు

మీడియా మీద రెస్పెక్ట్ ఉంది. నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి సపోర్టు చేశారు. కానీ ఈ మధ్య నా గురించి చాలా దారుణంగా రాశారు. ఆ వార్తలు విని నాతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధ పడ్డారని తరుణ్ తెలిపారు.

గోవా, బినామీ పబ్బులు అవాస్తం

గోవా, బినామీ పబ్బులు అవాస్తం

నెలలో 15 రోజులు నేను గోవాలోనే ఉంటానని, సిటీలో బినామీ పేర్లతో పబ్స్ ఉన్నాయని, పార్ట్‌నర్‌గా ఉన్నాయని నాపై ప్రచారం జరుగుతోంది. ఇవేవీ నిజం కాదు. నాకు అలాంటివేమీ లేవని తరుణ్ తెలిపారు.

బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయినట్లు ప్రచారం

బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయినట్లు ప్రచారం

గతంలో కూడా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని ప్రచారం జరిగింది. తర్వాత మా మదర్ ఫ్రెండ్ డాటర్‌తో పెళ్లి కుదిరిందని ఇలా ఎన్నో వచ్చాయి. ఇవన్నీ వింటుంటే నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలిగింది. ఎంటైర్ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నామనేది మాటల్లో చెప్పలేను అని తరుణ్ తెలిపారు. దయచేసి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని సిన్సియర్‌గా రిక్వెస్ట్ చేస్తున్నానని తరుణ్ తెలిపారు.

నెక్ట్స్ మూవీ గురించి

సినిమాల విషయానికొస్తే చాలా రోజుల తర్వత ‘ఇది నా లవ్ స్టోరీ' అనే మంచి సినిమా చేశాను. రీసెంటుగా టీజర్, మూడు సాంగులు విడుదల చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సంతోష సమయంలో ఈ ఇష్యూ జరుగడం బాధగా ఉంది. ఈ సమయంలో సపోర్టు ఇచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు అని తరుణ్ తెలిపారు.

English summary
Actor Tarun Facebook Video After SIT Officer Interrogation About Drugs Case. The actor tried to defend himself submitting the explanation on the various aspects to with he was alleged.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu