twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త కోణం: మీడియాతో ఉదయ్ కిరణ్ మేనేజర్ మున్నా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అవకాశాలు లేక పోవడం, అవమానాలు ఎదురు కావడం, ఆర్థిక ఇబ్బందులే అని అంతా ఇప్పటి వరకు భావించారు. అయితే ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నా మాత్రం కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో పలు విషయాలు చెప్పుకొచ్చారు.

    ఉదయ్ కిరణ్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మున్నా చెప్పుకొచ్చారు. అప్పులు కూడా కారణం కాదన్న ఆయన.....ఆయనకు స్థలాల రూపంలో భారీగా ఆస్తులు ఉన్నాయని, ఒక వేళ ఆయనకు అప్పులు ఉంటే వాటిలో ఏది అమ్మినా అప్పులు తీరిపోతాయని చెప్పుకొచ్చారు. అవకాశాలు లేవనే వాదనలో కూడా వాస్తవం లేదని మున్నా అంటున్నారు.

    Actor Uday Kiran

    ఆయనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయని, కథలు నచ్చక పోవడం వల్లనే ఆయన అంగీకరించలేదని చెబుతున్నాడు. అదే విధంగా సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్‌తో ఆయనకు సంబంధం లేదని అంటున్నాడు మున్నా. ఇలాంటి సాధారణ విషయాలకు ఆత్మహత్య చేసుకునే పిరికి వాడు ఉదయ్ కిరణ్ కాదు అంటున్న ఆయన......బయటి ప్రపంచానికి తెలియని ఏదో బలమైన కారణం ఉందని మున్నా అభిప్రాయ పడ్డారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఉన్న ఆ బలమైన కారణం ఏమిటి? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు అసలు కారణాన్ని కనిపెట్టేందుకు తమదైన దారిలో ముందుకు సాగుతున్నారు.

    English summary
    
 On Wednesday, Police questioned Munna, the former manager of Actor Uday Kiran, who has become a producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X