Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నా కూతురు కూడా ఇక్కడే, అడిగితే ఏం చెప్పాలి: శ్రీరెడ్డి వివాదంపై ఉత్తేజ్ ఎమోషనల్
'మా' సభ్యత్వం ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని ఆరోపిస్తూ శ్రీరెడ్డి చేసిన అర్దనగ్ర ప్రదర్శనపై 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' సీరియస్ అయింది. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన 'మా' సభ్యులు శ్రీరెడ్డి లాంటి వారికి సభ్యత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆమెతో 'మా' సభ్యత్వం ఉన్న 900 మంది నటించబోరని, ఒక వేళ నటిస్తే వారిని సస్పెండ్ చేస్తామని తీర్మాణించారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.
Recommended Video


శ్రీరెడ్డి చెప్పింది పచ్చి అబద్దం
‘మా' సభ్యత్వం ఇవ్వడం లేదని శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఉత్తేజ్ తెలిపారు. ఆ అమ్మాయి ఆఫీస్‌కు వచ్చినపుడు నేనూ, శ్రీకాంత్, శివాజీ అన్న కూడా ఉన్నారు. నా పరిస్థితి ఇలా ఉందంటే.... శివాజీ అన్న చాలా సెన్సిటివ్. వెంటనే రియాక్ట్ అయ్యారు. అమ్మా నువ్వు నన్ను సొంత అన్నయ్య అనుకో, ప్రెసిడెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టు. జరిగింది ఏదో జరిగిపోయింది. అప్లికేషన్ తీసుకో, సంతకం పెట్టు అని ఎంకరేజ్ చేశారు. తేజగారితో పర్సనల్‌గా మాట్లాడితే ఆయన రెండు సినిమాలు ఇచ్చారు. అప్లికేషన్ మీద సంతకం పెట్టి వెళ్లిపొమ్మని చెప్పా. ఆమె ‘మా' ఆఫీస్ మెట్లు దిగిన వెంటనే సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ వచ్చేసింది.... ఇలా చేసే వారికి ‘మా'లో సభ్యత్వం ఎలా ఇస్తాం? అని ఉత్తేజ్ అన్నారు.

నా కూతురు కూడా హీరోయిన్
నా కూతురు ఆల్రెడీ హీరోయిన్ అయింది. తన పేరు చేతన. రేపు ఇంకో సినిమా చేస్తోంది. నా చిన్న కూతురును కూడా సినిమాల్లోకి తీసుకొస్తాను, నాకు ఇంకో కూతురు పుడితే కూడా సినిమాల్లోకి తీసుకొస్తాను. నాకు సినిమా అంటే ప్రాణం. ఎవరి వాళ్లు వారి కుటుంబంలోకి రావాలనుకుంటారు... అని ఉత్తేజ్ అన్నారు.

అప్లికేషన్ ఇచ్చామంటనే ‘మా’ సభ్యత్వం వచ్చినట్లు, కానీ కాపాడుకోలేదు
అప్లికేషన్ ఇచ్చామంటేనే ‘మా' కుటుంబంలోకి తెచ్చుకున్నట్లు అర్థం. ఆమె తేజ సినిమాలో క్లిక్ అయ్యేదేమో? ఆమె దాన్ని కాపాడుకుంటే బావుండేది. కానీ అలా చేయలేదు. నిన్న మనందరి ముందు, మన ఫ్యామిలీ ముందు, ఒక అమ్మ ముందు, ఒక నాన్న ముందు, ఒక చెల్లె ముందు అలా అర్దనగ్న ప్రదర్శన చేయడం బాధ అనిపించింది.... అని ఉత్తేజ్ అన్నారు.

ఇది క్రియేటివ్ జాబ్, ఛాన్స్ రావచ్చు..రాక పోవచ్చు
నాకు కూడా అనిపిస్తుంటుంది... నా కూతురు చేతనకు సినిమాలు రావట్లేదేమిటి? అని, ఇది క్రియేటివ్ జాబ్ ఇది, ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. వచ్చినపుడు క్లిక్ అవుతాం. వేణు మాధవ్ కంటే నేను బ్రహ్మాండమైన ఆర్టిస్టు కావొచ్చు. కానీ వాడికి దిల్, సింహాద్రి ఇలా వరుసగా సూపర్ హిట్స్ వచ్చాయి. కామట్టి కమర్షియల్ సక్సెస్ లోకి వెళ్లాడు. ఇక్కడ టాలెంటుతో పాటు సక్సెస్, అదృష్టం అన్నీ సెట్టయితే కానీ యాక్టర్ అవ్వలేం.... అని ఉత్తేజ్ అన్నారు.

నా చిన్న కూతురు అడిగితే ఏం చెప్పాలి?
మా చిన్న పాప టీవీలో చూసి ఏంటి నాన్న ఆమె ఏం చేస్తోంది అని అడిగితే ఏం చెప్పాలి? సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని చెప్పాలా? అది చాలా తప్పు. ఆమెను గుండెల్లో పెట్టుకుందామనుకున్నాం. కానీ ఆమె వేరే రకంగా వెళ్లిపోయింది. అన్నయ్య శివాజీ రాజా డెసిషన్ కు మేమంతా కట్టుబడి ఉన్నాం. దయచేసి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకుండి... అని ఉత్తేజ్ అన్నారు.