For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టార్ హీరో వారసులపై ఉత్తేజ్ షాకింగ్ కామెంట్స్.. పేర్లు చెప్పుకుంటే కుదరదంటూ..

  |

  అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన నటుడు ఉత్తేజ్. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత. కేవలం నటుడిగానే కాకుండా మాటల రచయితగా కూడా పని చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అదే సమయంలో ప్రస్తుత తరం హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  అప్పటి హీరోనేనా అనిపిస్తుంది

  అప్పటి హీరోనేనా అనిపిస్తుంది

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి వివరిస్తూ.. ‘నిజంగా చెప్పాలంటే హీరోలందరూ కష్టపడతారు. తమను తాము చెక్కుకోకపోతే.. గంగోత్రి నుంచి మొన్న వచ్చిన సినిమా వరకు బన్నీ ఎంత మారాడు. ఇప్పుడు అతడిని చూస్తే గంగోత్రి హీరోనేనా అనే సందేహం వస్తుంది. అంతలా తనను తాను చెక్కుకున్నాడు' అని పేర్కొన్నాడు.

  వాళ్లంతా మారిపోయారు

  వాళ్లంతా మారిపోయారు

  ప్రస్తుత తరం హీరోల గురించి ప్రస్తావిస్తూ.. ‘చాలా మంది హీరోలు కష్ట పడుతున్నారు. మహేశ్ కూడా చాలా కష్టపడతాడు. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. అలాగే, నాని.. ఆయన నటన ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇక, రవితేజ అయితే మన పక్కింటి అబ్బాయిలాగే కనిపిస్తాడు. చరణ్‌కు తండ్రి నుంచి వచ్చిన ప్రోఫెషనలిజమ్ వచ్చింది. రంగస్థలంలో అతడిలోని నటుడు బయటకు వచ్చాడు' అని అన్నాడు.

   జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకం

  జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకం

  ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘ఎన్టీఆర్‌లో నాకు ఆర్టిస్టు కనిపిస్తాడు. యాక్టర్ వేరు.. ఆర్టిస్టు వేరు. ఒక స్టార్‌డమ్‌తో పాటు ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఉంటాడు. సోల్ ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ వచ్చి ఈయనలో ఉండిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక డ్యాన్సర్, ఫైటర్, సీన్లలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. పైగా, యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ ఏమైనా చెబితే అది ఏమాత్రం తేడా రాకుండా దాన్ని చేసి చూపిస్తాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విపరీతమైన మెమరీ అందుకే ఎన్టీఆర్ అంటే ఇష్టం' అని వెల్లడించాడు.

  వారసత్వంపై వ్యాఖ్యలు

  వారసత్వంపై వ్యాఖ్యలు

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారసుల గురించి ఉత్తేజ్ స్పందించాడు. ‘మన ఇండస్ట్రీలో చాలా మంది వారసులు హీరోలుగా కొనసాగుతున్నారు. హీరోలు, హీరోల కొడుకులు యాక్టర్లు అవుతారు అనేది నాగార్జున కాలం నుంచి ఉంది. తండ్రుల పేర్లు చెప్పుకుంటే ఒకటి రెండు సినిమాల వరకు అవుతారు. తర్వాత అవరు.. రిజల్ట్ చూస్తూనే ఉన్నాం. ఒకటి రెండు సినిమాలకు వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. సో.. కష్ట పడితేనే వాళ్లంతా హీరోలు అయ్యారు' అని చెప్పుకొచ్చాడు.

  English summary
  Uttej was introduced by Ram Gopal Varma with the Telugu film Siva in 1989. He has given life to so many heros and directors by introducing them to Ram Gopal Varma and Krishna Vamsi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X