»   » వేణు మాధవ్ చనిపోతే నేను ఎవర్ని? సాక్ష్యాలు చూపుతూ ఫైర్ (వీడియో)

వేణు మాధవ్ చనిపోతే నేను ఎవర్ని? సాక్ష్యాలు చూపుతూ ఫైర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైన వేణు మాధవ్ ఇక మనకు లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరి సారిగా మాట్లాడిన వేణు మాధవ్".... కొన్ని ఛానల్స్, వెబ్ సైట్లలో ఈ న్యూస్ చూసి యాత్ తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు చివరకు వేణు మాధవ్ కూడా షాకయ్యారు.

Actor Venu Madhav press meet video

పూర్తి ఆరోగ్యంగానే ఉన్న వేణు మాధవ్....మంగళవారం ఉదయం తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలా మీడియా ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన గుండుతో కనిపించారు. మీడియాతో వేణుమాధవ్ మాట్లాడుతూ.. మీరు అడగవచ్చు. కేన్సర్ లేకుంటే గుండెందుకు చేయించుకున్నారని..నేను మొన్న తిరుపతి వెళ్లాను. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని బాలయ్య గారి 100వ సినిమా.. చిరంజీవిగారి 150 సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మొక్కుకుని ఆ భగవంతుడిని కోరుకున్నాను అని తెలిపారు.

నేను చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుంది వేణుమాధవా? లేక వాడి తమ్ముడా? లేక వాడి బావమరిదా? నాపై ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎవరెవరు చేశారో వారందరిపైనా కేసు పెట్టడం జరిగింది" అని వేణుమాధవ్ అన్నారు.

English summary
Comedian Venu Madhav was deeply disturbed by the death hoax. A few media houses along with some websites, has spread the rumors that the comedian is no more, without checking the facts, early in the morning. Shocked to read the death reports doing the rounds, Venu Madhav filed a police complaint on the said media houses and websites, for their unprofessional and unethical behaviour. Venu Madhav vented out his anguish the incident a very unfortunate one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu