»   » మోడల్ మృతి కేసులో నటుడు విక్రమ్ అరెస్ట్, తెర వెనక రాజకీయం!

మోడల్ మృతి కేసులో నటుడు విక్రమ్ అరెస్ట్, తెర వెనక రాజకీయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగాలీ టీవీ హీరో విక్రమ్ చటర్జీని పోలీసులు కోల్‌కతాలో శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా చౌహాన్ మృతికి సంబంధించి ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏప్రిల్ 29న వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొని కలసి మందు కొట్టారు. ఆపై కారులో తిరిగి వెలుతుండగా తెల్లవారు ఝామున 3.30 గంటలకు కారు ప్రమాదానికి గురైంది. విక్రమ్ మితిమీరిన వేగంతో కారు నడపటంతో అదుపు తప్పి పల్టీలు కోట్టి ఫుట్ పాత్‌పైకి దూసుకెళ్లి.... పక్కన ఉన్న దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోనిక అక్కడికక్కడే మరణించగా, విక్రమ్ తీవ్రగాయాలతో బయట పడ్డారు.

మద్యం తాగడం వల్లే

మద్యం తాగడం వల్లే

సోనికా మృతికి కారణమయ్యాడనే అభియోగంతో విక్రమ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు అయింది. వాహనం నడుపుతున్న విక్రమ్ మద్యం తాగి ఉన్నాడని తేలడంతో, పోలీసులు అతనిపై ఈ కేసు నమోదు చేశారు.

ఆఫోటోలే సాక్ష్యం

ఆఫోటోలే సాక్ష్యం

పార్టీలో మద్యం సేవిస్తూ తీసుకున్న ఫోటోలను స్నేహితులకు విక్రమ్ షేర్ చేయగా, అవే ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి.

2 నుండి పదేళ్ల జైలు

2 నుండి పదేళ్ల జైలు

ఈ కేసులో విక్రమ్ మీద అభియోగాలు రుజువైతే 2 నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్ష పడవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

వారు కాపాడుతున్నారనే ఆరోపణలు

వారు కాపాడుతున్నారనే ఆరోపణలు

ఈ కేసు ఇపుడు బెంగాల్ లో రాజకీయ వివాదానికి కారణమైంది. విక్రమ్ చటర్జీని కాపాడేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె పార్టీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందిన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

English summary
Actor Vikram Chatterjee, who is facing a culpable homicide charge for the car crash in which model-anchor Sonika Chauhan was killed in April, was arrested in Kolkata this morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu