»   »  బీర్ ఇలా కూడా వాడతారా? తెలుగు హీరోయిన్ ప్రయోగం

బీర్ ఇలా కూడా వాడతారా? తెలుగు హీరోయిన్ ప్రయోగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే డ్రింక్స్‌లో బీర్ స్థానం ప్రత్యేకం. ఇది తాగితే వచ్చే ఆ కిక్కే వేరప్పా అనే బీరు బాబులు ఎందరో. అయితే ఓ తెలుగు హీరోయిన్ మాత్రం బీర్ పానీయాన్ని మరో రకంగా ఉపయోగిస్తోంది.

తెలుగులో 'బస్టాప్' సినిమా ద్వారా పరిచయం అయిన ఆనంది.... బీర్ వాడుతుందట కానీ అది తన శిరోజాలకు వాడుతుందట. తన హెయిర్ వాష్ చేసుకోవడానికి బీర్ ఉపయోగిస్తానని, దాని వల్ల తన వెంట్రుకలకు మరింత మెరుపు వస్తుందని అంటోంది ఈ బ్యూటీ.

మరి బీర్ తాగే అలవాటుందా?

మరి బీర్ తాగే అలవాటుందా?

హెయిర్ అందం కోసం బీర్ వాడుతుందంటే... డ్రింక్ చేసే అలవాటుకూడా ఉండే ఉంటుందని భావిస్తున్నారు. అయినా సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీల్లో బీర్, ఆల్కహాల్ లాంటివి సేవించడం సర్వసాధారణమైన విషయం.

సినిమాలో బీర్ తాగే అమ్మాయిగా

సినిమాలో బీర్ తాగే అమ్మాయిగా

ప్రస్తుతం ఆనంది ‘పాండిగై' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బీరుకు సంబంధించి సన్నివేశాలు చాలా ఉన్నాయట. ఓ సీన్లో బీరు తాగే అమ్మాయిగా నటించానని, మరో సన్నివేశంలో బాయ్ ఫ్రెండును బీరుతో తన హెయిర్ వాష్ చేయమని అడుగుతానని తెలిపింది. రియల్ లైఫ్‌లో కూడా బ్యూటీ టిప్ కింద బీర్ ఉపయోగిస్తానని... అప్పుడప్పుడూ బీర్ కొడతాను, హెయిర్ వాష్ చేసుకోవడానికి కూడా వాడతాను అని ఆనంది తెలిపినట్లు సమాచారం.

ఆనంది

ఆనంది

తెలుగమ్మాయి అయిన ఆనంది ‘బస్టాప్' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అయితే తమిళంలో సినిమా హీరోయిన్ ఛాన్సులు దక్కడంతో అటు వైపు వెళ్లి సక్సెస్ అయింది. అక్కడ హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

అసలు పేరు రక్షిత

అసలు పేరు రక్షిత

ఆనంది అసలు పేరు రక్షిత. వరంగల్ అమ్మాయి. బస్టాప్ సినిమా తర్వాత మరో మూడు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే తమిళంలో సక్సెస్ కావడంతో అక్కడే సెటిలైంది. ఇప్పటి వరకు 7 తమిళ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది చేతిలో 5 తమిళ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

English summary
Actress Aanandi used Beer for Hair wash. She made this revelation while talking about her upcoming Tamil film 'Pandigai', where she had acted in a couple of scenes involving beer. While in one scene, she had to drink beer, in another scene she asks her boyfriend for beer to wash her hair. She confessed that she had tried that 'beauty tip' in real life as well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu