»   » నేనేమైనా సన్యాసినా? నాకూ కోరికలుంటాయి: రెండో పెళ్లిపై అమలా పాల్

నేనేమైనా సన్యాసినా? నాకూ కోరికలుంటాయి: రెండో పెళ్లిపై అమలా పాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో వివాదాస్పద వార్తలతో ఎక్కువగా వార్తల్లో ఉండే హీరోయిన్ కేరళ బ్యూటీ అమలా పాల్. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో అమలా పాల్ ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. తమ ప్రేమకు ఇంట్లో ఎన్ని అడ్డంకులు చెప్పినా అతన్నే ప్రేమించి, పెళ్లి చేసుకుని తన పంతం నెగ్గించుకుంది.

ప్రేమ, పెళ్లి విషయంలో ఎంత స్పీడుగా ఉందో విడాకుల విషయంలో కూడా అమ్ముడు అంతే స్పీడు అని నిరూపించుకుంది. సంవత్సరం కాపురంలోనే భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. నాకు ఇంకా చాలా భవిష్యత్ ఉందని, ఇంత చిన్న వయసులో పెళ్లి అనే పెద్ద నిర్ణయం తీసుకుని తప్పుచేశానంటూ తర్వాత ఓ సారి మీడియా ముందు బాధపడిన సంగతి తెలిసిందే.

నేనేమైనా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు వెళతానా?

నేనేమైనా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు వెళతానా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్న ఎదురవ్వగానే కాస్త అసహనానికి గురైన అమలా పాల్.... జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండటానికి నేనేమైనా సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళతానుకుంటున్నారా? అంటూ చిర్రుబుర్రులాడింది.

నాకూ కోరికలుంటాయి

నాకూ కోరికలుంటాయి

జీవితాంతం ఇలానే ఒంటరిగా మగతోడు లేకుండా గడపటానికి తానేమీ సన్యాసిని కాదని, మీ అందరిలాగే తాను ఒక సాధారణ యువతినే అని, తనకూ కోరికలుంటాయనే అర్థం వచ్చేలా స్పందించింది.

మళ్లీ ప్రేమ వివాహమే చేసుకుంటాను

మళ్లీ ప్రేమ వివాహమే చేసుకుంటాను

తప్పకుండా నేను మరో వివాహం చేసుకుంటాను, అది కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాను..... ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకునే వీలుంటుంది. అరేంజ్డ్ మ్యారేజీలో అలాంటి అవకాశం ఉండదు అని అమలా పాల్ చెబుతోంది.

సమయం వచ్చినపుడు చెబుతాను

సమయం వచ్చినపుడు చెబుతాను

మళ్లీ ప్రేమ వివాహం చేసుకుంటాను అన్నాను కదా అని ఎలా పడితే అలా నా గురించి రాయొద్దు.... ఎవరిని ప్రేమిస్తాను, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనే విషయాలు సమయం వచ్చినపుడు వెల్లడిస్తాను అని అమలా పాల్ తెలిపారు.

అమలా పాల్

అమలా పాల్

అమలా పాల్ ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తమిళంలో తిరుట్టు పాయలే 2, వేలయిల్లా పట్టదారి 2, భాస్కర్ ఓరు రాస్కెల్, మినిమిని చిత్రాలతో పాటు మయాళంలో క్వీన్ రీమేక్‌తో పాటు మరో చిత్రంలో నటిస్తోంది.

English summary
Actress Amala Paul has boldly said that she will marry again. Apparently in an interview when Amala was asked about re-marriage she said, “Am I going to become a saint and go to the Himalayas. I will definitely marry someone and it will be a love marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu