»   » చలపతి, యాంకర్ రవి వ్యవహారంపై అమల సీరియస్.. మన వేడుకలో ఇలానా?

చలపతి, యాంకర్ రవి వ్యవహారంపై అమల సీరియస్.. మన వేడుకలో ఇలానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సామాజిక సమస్యలు, పర్యావరణం, జంతువుల సంరక్షణ లాంటి అంశాలపై సినీనటి, సామాజిక కార్యకర్త అక్కినేని అమల చూపే అందరికీ స్ఫూర్తిదాయకం. జంతువులకు ఏదైనా జరిగితే అల్లాడిపోయే మనస్తత్వం. బ్లూక్రాస్ పేరిట అమల చేపట్టే కార్యక్రమాలు గొప్పగా ఉంటాయి. గతంలో మహిళల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో జరిగిన చలపతిరావు, యాంకర్ రవి ఉదంతంపై అక్కినేని అమల మనస్తాపానికి గురైనట్టు సమాచారం. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన చలపతిరావు తీరుపై వెంటనే స్పందించాలని తన భర్త అక్కినేని నాగార్జున, కుమారుడు చైతూ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సూచించినట్టు తెలిసింది.

ఆడపిల్లలపై..

ఆడపిల్లలపై..

గతంలో ఓ వేడుక సందర్భంగా అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడుతారు అని చేసిన వ్యాఖ్యలపై అమల చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. నేను అబద్దాలు ఆడుతాను ఆడపిల్లలు పుడుతారా అని సదరు వ్యక్తిని వేదికపైనే నిలదీశారు అమల. అంతేకాకుండా మరో సంఘటనలో నక్కతోక తొక్కాడు అందుకే హీరో అయ్యాడని ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మూఢ నమ్మకాలపై..

మూఢ నమ్మకాలపై..

అప్పట్లో ఓ కార్యక్రమంలో నక్క తోక తొక్కాడు. అందుకే అతను హీరో అయ్యాడు అని ఇద్దరు యాంకర్లు మాట్లాడుకోవడంపై అమల సీరియస్ అయింది. వెంటనే యాంకర్లను పిలిచి నక్కతోక.. కుక్కతోక.. వేటినీ తొక్కకూడదు. మూఢ నమ్మకాలు వద్దు. జంతువులను హింసించవద్దు అని హితవు పలికింది. తెలుగులో ఓ సామెత ఉంది ఏదో సరదాగా అన్నామని చెప్పినా అమల ఊరుకోలేదు. దాంతో యాంకర్లు క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రతిభ కారణంగానే ఎవరైనా మంచి స్థానానికి చేరుకొంటారు.. గాలివాటంగా, మూఢ నమ్మకాల కారణంగా ఏది జరిగిపోదు అని వారికి వివరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

చలపతిరావుపై సీరియస్..

చలపతిరావుపై సీరియస్..

ఇలాంటి సున్నిత మనస్తత్వం ఉన్న అమల తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం వేడుకలో జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తున్నది. మన వేడుకలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకొంటే సమాజానికి ఏమి చెప్పగలుగతామని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు చలపతిరావు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొన్నారట. నాగార్జునతో వెంటనే స్పందించి ఖండన ప్రకటన ట్విట్టర్‌లో ఇవ్వడంతో ఆమె కొంత శాంతించినట్టు తెలుస్తున్నది.

నాగార్జున ఖండన

సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను మహిళలను గౌరవిస్తాను. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలపై చలపతిరావు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఈ సమాజంలో మహిళలను చిన్నచూపు చూసేవారిని, స్త్రీలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసే డైనోసార్లు ఇక ఉండవు అని నాగార్జున ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. నాగార్జున ట్విట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

మహిళలను గౌరవిస్తాను..

మహిళలను గౌరవిస్తాను..

మహిళలను నేను చాలా గౌరవిస్తాను. టెలివిజన్‌లో చూపినట్టుగా చలపతిరావు చేసిన వ్యాఖ్యలకు మేము నవ్వలేదు. వాళ్లు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొన్నారు అని నాగచైతన్య ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు.

నాకు అర్థం కాకపోవడం వల్లే..

నాకు అర్థం కాకపోవడం వల్లే..

చలపతిరావు చేసిన కామెంట్లకు స్పందించి తాను, చైతూ నవ్వామని టెలివిజన్ చానెళ్లు ప్రసారం చేసిన క్లిప్పింగులపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివరణ ఇచ్చింది. ఆ సమయంలో నాకు ఆయన మాట్లాడింది అర్థం కాలేదు. వేరే విషయంపై మాట్లాడుతూ నవ్వుకొన్నాం. ఆ తర్వాత చలపతిరావు చేసిన వ్యాఖ్యలు తెలుసుకొని వాటిని ఖండించాను అని రకుల్ ట్విట్ చేసింది.

English summary
Reports suggest that Actress, Social worker Amala serious over Chalapatirao dertogatory comments. Chalapatirao made serious comments on Women in Rarandoi Veduka Chuddam. His comments made Amala Angry. She asked to everyone condemn those statement by Chalapatirao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu