»   »  సంతానం కోసం మాజీ హీరోయిన్ కాళహస్తిలో ప్రదక్షిణలు

సంతానం కోసం మాజీ హీరోయిన్ కాళహస్తిలో ప్రదక్షిణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాళహస్తి: తేజ నువ్వు-నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి వెళ్లిపోయింది ఈ భామ. అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితా తాజాగా శ్రీకాళహస్తిలో పూజలు చేస్తూ కనిపించింది.

ఆమె కుటుంబసభ్యులతో కలసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు.అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణంలోని పొగడ చెట్టు వద్ద సంతానం కోసం ప్రదక్షణలు చేశారు.

అనిత మాట్లాడుతూ...సంతానం కోసం శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేయించుకుంటే తప్పకుండా సంతానం లభిస్తోందని మా మిత్రులు చెప్పారు.దాంతో కుటుంబసభ్యులతో కలసి విచ్చేసినట్లు సినీనటి అనిత అన్నారు.

Anitha

సంతానంతో పాటు మనలో ఒకడు అనే చిత్రంలో తాను నటించానని...ఆ చిత్రం విజయవంతం కావాలని శివపార్వతులను కోరుకున్నట్లు చెప్పారు.ఆలయ శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని కొనియాడారు.వారితోపాటు ఆలయు ధర్మకర్తల వుండలి సభ్యులు లోకనాధంనాయిడు,నారాయణయాదవ్ ఉన్నారు.

నువ్వు నేను.. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో హీరో ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితలను సినిమా ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. 15 ఏళ్ల క్రితం ఈ మూవీ విడుదలైంది. ఈ భామ ఇప్పటికీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషమే. ముందు యాడ్స్ తర్వాత తెలుగు ఆ తర్వాత హిందీ.. నెక్ట్స్ కన్నడ - తమిళ సినిమాలు చేస్తూ.. బాగానే కెరీర్ కంటిన్యూ చేసింది.

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ భామ కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. అయినా సరే సినిమాలను మాత్రం కొనసాగించడం విశేషం. చివరగా జీనియస్ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ తర్వాత తెలుగులో కనిపించని అనిత.. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం చేజిక్కించుకుంది. ఆర్పీపట్నాయక్ హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ 'మనలో ఒకడు' అనే సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా. మీడియానే కథాంశంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనిత నటిస్తోంది.

English summary
There is a strong belief and sentiment among many that by visiting the Srikalahasti temple all bad obstacles will get washed off. Right now, there is news that Actress Anitha has also visited the Srikalahasti temple and performed a pooja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu