»   » లవ్ ప్రపోజల్స్, అతడితో రిలేషన్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందన!

లవ్ ప్రపోజల్స్, అతడితో రిలేషన్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అంజలిని ఆ మధ్య ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయో అందరికీ తెలిసిందే. తన పెంపుడు తల్లి(పిన్ని)తో ఆర్థిక వివాదాలు, తమిళ దర్శకుడు కళంజియంతో సినిమా వివాదం... ఈ క్రమంలో ఆమె కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెల్లడం, తర్వాత కోర్టు కేసులు అప్పట్లో సెన్సేషన్.

ప్రస్తుతం చిత్రాంగద మూవీ చేస్తున్న అంజలి... సినిమా ప్రమోషన్లో భాగంగా టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన గత వివాదాలకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఉండకూదనే షరతు పెట్టిన ఆమె... ఇతర ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

అంజలి అప్పట్లో బిఎండబ్ల్యూ కారు కొనుక్కోవడం హాట్ టాపిక్ అయింది. ఆ కారు ఆమె కొన్నది కాదని, ఎవరో గిఫ్టుగా ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఈ విషయాలపై అంజలి స్పందించారు.

ఆ కారు ఎక్కడిదంటే..

ఆ కారు ఎక్కడిదంటే..

నేను చెన్నైలో ఫస్ట్ మూవీ చేస్తున్నప్పటి నుండే బిఎండబ్ల్యూ కారు కొనుక్కోవాలనేది నా డ్రీమ్. నేను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నాను, ఎవరూ గిఫ్టుగా ఇవ్వలేదు అని అంజలి తెలిపారు.

 అతడితో రిలేషన్

అతడితో రిలేషన్

కోన వెంకట్ నా గాడ్ ఫాదర్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, నా వెల్ విషర్స్ లో ఆయన ఒకరు. నేను నటించిన బలుపు చిత్రానికి రైటర్ గా చేసారు, గీతాంజలి చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా పని చేసారు అని అంజలి తెలిపారు.

ఎవరి నుండి గిఫ్టులు ఎక్స్ పెక్ట్ చేయను

ఎవరి నుండి గిఫ్టులు ఎక్స్ పెక్ట్ చేయను

నేను బయట ఎవరి నుండి గిఫ్టులు ఎక్స్ పెక్ట్ చేయను. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. సొంతగా సంపాదించడం మొదలు పెట్టాక ఎవరూ కూడా ఇలాంటివి ఆశించరు అని అంజలి తెలిపారు.

తొలి రెమ్యూనరేషన్

తొలి రెమ్యూనరేషన్

హీరోయిన్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుండి గోల్. చాలా కష్టపడి నా గోల్ రీచ్ అయ్యాను. హీరోయిన్ తొలి చిత్రం తమిళంలో చేసాను. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యూనరేషన్ వేలల్లోనే... అని అంజలి తెలిపారు.

లవ్ ప్రోజల్స్

లవ్ ప్రోజల్స్

స్కూల్ టైం నుండే లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఓ అబ్బాయి సెవంత్ నుండి టెన్త్ వరకు ప్రపోజ్ చేసాడు. టెన్త్ లో అతడికి రాఖీ కట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది ప్రపోజ్ చేసారు, ప్యాన్సే ఎక్కువగా ఎమోషనల్ గా ప్రపోజ్ చేస్తారు... అని అంజలి తెలిపారు.

పెళ్లి ఇప్పుడే చేసుకోను, హీరోయిన్ గా కెరీర్ పూర్తయిన తర్వాతే

పెళ్లి ఇప్పుడే చేసుకోను, హీరోయిన్ గా కెరీర్ పూర్తయిన తర్వాతే

హీరోయిన్ గా ఉన్నపుడు పర్సనల్ లైఫ్ మిస్సవడం కామన్. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి కంటే ప్రొషన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అని అంజలి తెలిపారు.

English summary
Actress Anjali revealed about her personal life and professional life in TNR interview. Anjali is an award-winning Indian film actress and model, who predominantly appears in Tamil (Kollywood)and Telugu films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu