For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శ్రీరెడ్డి టీంలో మరో వర్గం, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్... మసాజ్ ఆరోపణలు తిప్పకొట్టిన అపూర్వ!

  By Bojja Kumar
  |

  కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలి అంటూ శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో నటి అపూర్వతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీమణులు జాయినైన సంగతి తెలిసిందే. ఇటీవల మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన చర్చా కార్యక్రమంలో కొందరు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

  పవన్ కళ్యాన్‍‌కు బెంగాల్ అమ్మాయిలతో మసాజ్‌లు కావాలి అంటూ శృతి అనే నటి చేసిన ఆరోపణలు పెద్ద వివాదానికి దారి తీశాయి. మరో వైపు ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తున్న శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌కు మా పోరాటం కనిపిచడం లేదా? అంటూ విమర్శకుల దిగింది. అయితే వీరితో కలిసి ఈ పోరాటంలో పాలు పంచుకున్న నటి అపూర్వ.... పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కామెంట్స్ చేయడం గమనార్హం.

  పవన్ కళ్యాణ్ మానవత్వం ఉన్న మనిషి: అపూర్వ

  పవన్ కళ్యాణ్ మానవత్వం ఉన్న మనిషి: అపూర్వ

  ఇక్కడ అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వారు ఉన్నారు. మీ సమస్య మీరు చెప్పడం తప్పుకాదు. మీరు ఆవేశంలో, ఫ్రస్టేషన్లో ఏదో అన్నారు. పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఉన్న బిజీలో ఆయన రెస్పాండ్ అయి ఉండక పోవచ్చు. మీరు స్టేషన్ కు వెళ్లండమ్మా... అక్కడ మీకు న్యాయం జరుగక పోతే మీడియాను ఆశ్రయించండి అని ఆయన చెప్పి ఉండవచ్చు. అంతే కానీ ఆయన తప్పుడు మనిషి కాదు, మానవత్వం ఉన్న మనిషి అని అపూర్వ అన్నారు.

  ఆయన రాలేదనే బాధలో ఏదో అనేశారు

  ఆయన రాలేదనే బాధలో ఏదో అనేశారు

  మేమంతా సఫర్ అవుతున్నపుడు ఎందుకు పవన్ కళ్యాన్ రాలేదు అనే బాధలో ఒక్కొక్కరు ఒక్కో మాట అనేశారు. దయ చేసి ఎవరి పర్సనల్ లైఫ్ జోలికి వద్దు. ఇక్కడ చూడాల్సింది వారి హ్యూమానిటీ మాత్రమే. ఆయన మసాజ్ చేయించుకున్నారు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు? అనడం చాలా తప్పు. ఎవరి పర్సనల్ లైఫ్ మన టార్గెట్ కాదు.... అని అపూర్వ వ్యాఖ్యానించారు.

  వారి తరుపున నేను సారీ చెబుతున్నాను

  వారి తరుపున నేను సారీ చెబుతున్నాను

  మనం ఏదైతే సమస్యపై పోరాడుతున్నామో అదే మన టార్గెట్. దయచేసి ఎవరి పర్సనల్ లైఫ్ ఇందులోకి లాగవద్దు. మా పిల్లలు తెలియక అలా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే వారి తరుపున నేను పవన్ కళ్యాణ్ గారికి సారీ చెబుతున్నాను. ఆయన ఎంత మందికి సహాయం చేశారో నాకు తెలుసు.... అని అపూర్వ తెలిపారు.

  ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి మీరెవరు?

  ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి మీరెవరు?

  పవన్ కళ్యాణ్ గురించి నిన్నొక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడారు అంటూ కొందరు ఎదురు ప్రశ్నించగా..... అపూర్వ తన స్వయం పెంచారు. పవన్ కళ్యాణ్ మానవత్వం గురించి వంద మంది ముందు మాట్లాడటానికైనా నేను సిద్ధమే. ఒక వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మాట్లాడటానికి మీరెవరు? వాళ్ల వైఫ్‌లు ఎవరైనా వచ్చి మీతో ఏమైనా బాధ చెప్పుకున్నారా? మీరు ఎవరండీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి.... అంటూ అపూర్వ ఫైర్ అయ్యారు.

  కోట్ల డబ్బు ఉంది, తలుచుకుంటే రోజుకో అమ్మాయిని తెచ్చుకోగలడు

  కోట్ల డబ్బు ఉంది, తలుచుకుంటే రోజుకో అమ్మాయిని తెచ్చుకోగలడు

  పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాకపోతే ఆయనకు వచ్చే కోట్ల డబ్బుతో మసాజులు చేయించుకుంటూ రోజుకో అమ్మాయిని తెచ్చుకుంటూ హ్యాపీగానే ఎంజాయ్ చేయగలడు. కానీ ఆయన అలా చేయడం లేదు, ఎండలో ప్రజల కోసం పోరాడుతున్నాడు. మనం అది కూడా చూడాలి.... అని అపూర్వ చెప్పుకొచ్చారు.

  ప్రస్టేషన్లో అనుకున్న మాటలే

  ప్రస్టేషన్లో అనుకున్న మాటలే

  మాకు ఏ వ్యక్తి మీద పర్సనల్‌గా ఏమీ లేదు. ఎవరిలోనైనా హ్యూమానిటీ గ్రౌండ్స్ చూస్తాము. ఎదుటివారు సమస్య ఎక్కడి వరకు వింటున్నారు? ఎంత వరకు హెల్ప్ చేయగలరో మాత్రమే చూస్తాం. ఆ అమ్మాయి ప్రస్టేషన్లో పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడింది. తప్పు చేశాను అనుకుంటే సారీ చెబుతుంది.... అని అపూర్వ చెప్పుకొచ్చారు.

  English summary
  Recently actress Shruthi lashed out at the so-called 'heroes' and 'heroines' of Tollywood, who have not come out in the open to support them. Urging women not to vote for Jana Sena Party chief, Pawan Kalyan, she said that he 'wants Bengali women for massage.' Actress Apoorva tried to stop her from speaking further. Now Apoorva condemned Shruthi comments and Supporting Pawan Kalyan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more