»   » శ్రీరెడ్డికి నటి అపూర్వ మద్దతు: ఇండస్ట్రీలో చాలా దారుణాలు, వ్యభిచారమే గతి!

శ్రీరెడ్డికి నటి అపూర్వ మద్దతు: ఇండస్ట్రీలో చాలా దారుణాలు, వ్యభిచారమే గతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శన సంచలనం అయింది. ఈ వ్యవహారంలో 'మా' ఆమెపై బ్యాన్ విధించడంతో పాటు ఆమెతో 'మా'లోని 900 మంది సభ్యులు నటించబోరని తీర్మానించారు. శ్రీరెడ్డి చర్యను కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సపోర్టు చేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డికి మద్దతుగా నటి అపూర్వ వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అపూర్వ ఏ గతిలేకనే శ్రీరెడ్డి రోడ్డు మీదకు వచ్చి బట్టలిప్పుకుందని, ఒక ఆడ పిల్లను అక్కడి వరకు తెచ్చినందుకు మనం బాధ పడాలి అని వ్యాఖ్యానించారు.

Sri Reddy About Her New Movie Offers
నాకు తెలిసిని అమ్మాయిపై దారుణంగా

నాకు తెలిసిని అమ్మాయిపై దారుణంగా

సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి వారే లేరు, కొంత మంది వ్యక్తుల వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అపూర్వ తెలిపారు. ఒక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ వేసుకునే అమ్మాయి వస్తే ఆడిషన్‌కు పిలిచి మేనేజర్, కోడైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా అందరూ వాడుకున్నారు. ఒక ఆడ పిల్ల పాషన్‌‌తోనో, ఇంకేదో కారణంతోనే ఇండస్ట్రీకి వస్తారు. వాడుకుంటే వాడుకున్నారు, ఒక ఆఫర్ ఇస్తున్నారా? అదీ లేదు... అంటూ అపూర్వ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఎంత మందికి అన్నం పెట్టగలను

నేను ఎంత మందికి అన్నం పెట్టగలను

నాకు తెలిసిన పిల్లను ఇలా చేశారు. తల్లి దండ్రులు లేరు. సినిమాలు నమ్ముకుని వచ్చింది. ఇలా చేశారని తెలిసి చాలా బాధేసింది. మొన్న ఆ అమ్మాయికి హెల్త్ బాగోలేదు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఆసుపత్రిలో పడింది. చూసే వారు లేరు, డాక్టర్స్ 48 గంటలు మాత్రమే అని చెప్పారు, ఆమె బ్రతికితే నా పిల్ల అనుకుని అన్నం పెట్టుకుంటాను అని చాలా ఏడ్చాను. అలా ఎంత మందికి పెట్టగలను, ఎంత మందిని ఇండస్ట్సీలో ఇలా ఏడిపిస్తారు. అలా అని అందరూ చెడ్డవారని నేను అనడం లేరు, చాలా మంది మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు. చాలా మంది గుడ్ డైరెక్టర్స్ ఉన్నారు.... అని అపూర్వ తెలిపారు.

 వ్యభిచారమే గతి

వ్యభిచారమే గతి

ఈ రోజు మేము తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చాము. ఆఫర్లు లేవు, మేము ఏం చేసుకుని బతకాలి, మాకు బతుకుదెరువు ఇప్పించరా? నా కంటే కొంత ఉంది... ఊరెళ్లి నాలుగు ఎకరాల్లో పూలతోట వేసుకుని బతుకుతాను. లేని పిల్లలు ఏం చేయాలి? వ్యభిచారం చేయాలి, అలా చేసినా మమ్మల్ని రోడ్డు మీదకే లాగుతారు. మీరు వ్యభిచారం చేస్తున్నారు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు అంటారు... అని అపూర్వ తన మనసులోని బాధను వ్యక్త పరిచారు.

శ్రీరెడ్డి అడిగేది అదే..

శ్రీరెడ్డి అడిగేది అదే..

మీరు బతకుదెరువు చూపించండి అని శ్రీరెడ్డి అడుగుతోంది. 75 శాతం తెలుగు వారిని సినిమాల్లో, సీరియల్‌లో పెట్టుకోండి. శ్రీరెడ్డి విషయం నేను హేమకు ఫోన్ చేసి చెప్పినపుడు తను పిలిచి మాట్లాడి ఉంటే సమస్య అప్పుడే సాల్వ్ అయ్యేది. కానీ తను పిలవలేదు.... అని అపూర్వ తెలిపారు.

 నేనూ ‘మా' మెంబరే, ఎవరిని అడిగి బ్యాన్ చేశారు?

నేనూ ‘మా' మెంబరే, ఎవరిని అడిగి బ్యాన్ చేశారు?

మేము 900 మంది కలిసి శ్రీరెడ్డిపై ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఆ 900 మందిలో నేనూ ఒకదాన్ని. ఆ అమ్మాయి ఇలా గుడ్డలిప్పేసింది, ఆమెను బ్యాన్ చేస్తున్నాం, నీకు ఇష్టమా? కాదా? అని నన్ను అడిగారా? ఎవరినీ అడక్కుండా మీ 20 మంది ప్యానల్‌లో నిర్ణయం తీసుకుని ఎలా బాయ్‌కాట్ చేస్తారు? అని అపూర్వ ప్రశ్నించారు.

మరి వారిని బాయ్‌కాట్ చేయరా?

మరి వారిని బాయ్‌కాట్ చేయరా?

రేపు నేను కూడా ఒక ఎలిగేషన్ తీసుకెళతా... నన్ను కూడా బాయ్‌కాట్ చేస్తారా? డ్రగ్స్‌లో దొరికిన వారిని బాయ్ కాట్ చేయరా? మిగతా వాటిలో దొరికిన వారిని బాయ్‌కాట్ చేయరా? ఆ అమ్మాయి ఏం చేసింది? నిస్సహాయ స్థితిలో ఏ గతిలేక రోడ్డు మీదకు వచ్చి బట్టలిప్పుకుంది. ఒక ఆడ పిల్లను అక్కడి వరకు తెచ్చినందుకు మనం బాధ పడాలి.... అని అపూర్వ అన్నారు.

ఇండస్ట్రీలో వందల మంది శ్రీరెడ్డిలు

ఇండస్ట్రీలో వందల మంది శ్రీరెడ్డిలు

ఇండస్ట్రీలో శ్రీడ్డి మాదిరిగా మేనేజర్లు, అసిస్టెంట్లు, కో డైరెక్టర్లు తదితరుల చేతిలో మోస పోయిన వారు వందల మంది ఉన్నారని, వారందరినీ తాను తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టగలను అని అపూర్వ అన్నారు.

English summary
Senior Actress Apoorva Supports Sri Reddy Protest. Apoorva Revealed Unknown Facts Of Tollywood. She siad many industry people exploiting them in exchange of work in films, but never got any opportunity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X