»   » నా మనవరాలు మంత్రగాడి మాయలో పడింది... శృంగార తార బామ్మ పోలీస్ కంప్లైంట్

నా మనవరాలు మంత్రగాడి మాయలో పడింది... శృంగార తార బామ్మ పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంత్రగాడి చేతిలో చిక్కుకున్న తన మనవరాలిని రక్షించాలని కోరుతూ శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను కోరారు. స్థానిక సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి గత మంగళవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఓ ఫిర్యాదు అందజేస్తూ... 'పిరందాచ్చు' అనే చిత్రంతో నా మనవరాలు బాబీలోనా సినిమాల్లోకి ప్రవేశించిందని, ఆమెను ఉన్నత స్థాయికి చేర్చేందుకు తానెంతో కృషి చేశానని పేర్కొన్నారు.

 Actress Babilona trapped in black magic?

అయితే ఆరణి ప్రాంతానికి చెందిన సుందర్‌ పాల్‌రాజ్‌ అనే వ్యక్తి తాంత్రిక చర్యలతో తన మనవరాలు బాబీలోనాని వశం చేసుకొన్నాడని, అతడి చెర నుంచి తన మనవరాలిని విడిపించాలని కృష్ణకుమారి పోలీసులను కోరారు. ఓ జిమ్‌లో పరిచయమైన సుందర్‌ పాల్‌రాజ్‌తో ప్రేమలో పడిన బాబీలోనా గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదును కొట్టేయాలని బాబీలోనా పోలీసులను కోరారు. భర్త పైనే ఫిర్యాదు చేయడంపై ఆమె బామ్మపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యాపార వేత్త సుందర్ పాల్ రాజు తో గతకొంత కాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తున్న ఈ భామ ఎట్టకేలకు తమ పెళ్ళి చెన్నై వడపళని లో గల నక్షత్ర స్టార్ హోటల్ లో అయ్యింది . తమిళ సినిమాల్లో మాత్రమే కాక తెలుగు ,కన్నడ మలయాళ భాషల్లో కూడా బాబీ లోనా నటించింది . అయితే కొంత కాలం గా వీరిద్దరి ప్రేమయనం ఇంట్లో గొడవలకు కారనమయ్యిందట, రాజకీయాలోకి కూడా ప్రవేశించే బాబీలోనాకి ప్రస్తుతం అవకాసాలు కూడా పెద్దగాలేకపోవటం తో తన బామ్మ అయిన కృష్న కుమారిని పట్టించుకోకుండా వదిలేసి పెళ్ళి చేసుకోవటం తో ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందని చెప్పుకుంటున్నారు.

English summary
The grandmother of actress Babilona has lodged a police complaint alleging that her granddaughter is in the trap of a married black magician named Sundar Poulraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu