»   »  పర్సనల్‌గా కలుస్తుంది: అభిమానులకు ఛార్మి ఓపెన్ ఆపర్!

పర్సనల్‌గా కలుస్తుంది: అభిమానులకు ఛార్మి ఓపెన్ ఆపర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెల 17న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న చార్మి....ఈ సందర్భంగా తన అభిమానులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. పర్సనల్‍‌గా మిమ్మల్ని కలుస్తుందట. అభిమానులకు ఇంతకు మించిన ఆఫర్ ఏముంటుంది చెప్పండి.

అందుకు మీరు చేయాల్సిందల్లా ఛార్మిని పొగుడుతూ 30 సెకన్ల వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాలి. అయితే ఓ కండీషన్ కూడా ఉంది. ఈ వీడియో తన తాజా సినిమా 'జ్యోతిలక్ష్మి' సినిమా ప్రమోషన్‌కు సంబంధించినదై ఉండాలి. తనకు నచ్చే విధంగా వీడియో తీసిన వీరాభిమానిని ఎంపిక చేసి పర్సనల్ గా కలుస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం!

ఛార్మి ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమా ‘జ్యోతి లక్ష్మి'. సి.కె.ఎంటర్టెన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జ్యోతి లక్ష్మి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసారు.

Actress Charmi birthday offer for fans

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...జ్యోతి లక్ష్మి చిత్రం ‘మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా తెరకెక్కించాను. ఈ సుప్రసిద్ధ నవలను ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసారు. దాదాపు ఆరేళ్ల నుండి ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి వీలైంది. ఈ ట్రెండుకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసి సినిమాను తీసాం. గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా విషయంలో నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

జ్యోతి లక్ష్మి సినిమా యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ మూవీ అని నిర్మాతలు అంటున్నారు. ఈచిత్రం ఆడియోను మే చివరి వారంలో విడుదల చేసి జూన్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో చార్మి టైటిల్ రోల్ చేస్తుండగా, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Actress charmi birthday offer for fans. On her birthday that falls on May 17th actress Charmi has given open invitation to her fans. What is the offer? People should charm her. So what if a someone charms her? Simple they They would meet her on her birthday. So what should they do to charm Charmi? Take a video of 30 seconds duration and post on YouTube.
Please Wait while comments are loading...