»   » దీపికా పదుకొనే బోరున ఏడ్చేసింది.. సంజయ్ లీలా భన్సాలీ కారణమట.

దీపికా పదుకొనే బోరున ఏడ్చేసింది.. సంజయ్ లీలా భన్సాలీ కారణమట.

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, అందాల తార దీపికా పదుకొనే మధ్య రిలేషన్ బ్రహ్మండంగా ఉంటుంది. అందుకే వరుసగా మూడో సినిమాలో కూడా దీపికానే నటిగా ఎంచుకొన్నారు. అలాంటి మంచి రిలేషన్ ఉన్న నేపథ్యంలో సంజయ్ కారణంగా దీపికా రామ్‌లీలా సెట్లో కంటతడి పెట్టాల్సి వచ్చింది. దీపిక బోరుమని ఏడ్వడంతో తాము ఆమెను ఓదార్చాల్సి వచ్చిందని రామ్‌లీలా సంభాషణ రచయితలు గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు.

డైలాగ్స్ చెప్పడంలో..

డైలాగ్స్ చెప్పడంలో..

సన్నివేశం పండాలని తాపత్రయం పడే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఫర్‌ఫెక్షన్ కోసం చివరి నిమిషంలో డైలాగ్స్ మార్చడంలో సంజయ్ ముందు వరుసలో ఉంటారు. రామ్‌లీలా తొలిరోజు షూటింగ్ జరుగుతున్నది. అప్పటికే దీపికాకు డైలాగ్ పేపర్లు ఇచ్చారు. దాని ప్రకారం ఆమె డైలాగ్స్‌తో సిద్ధమైంది. చివరి నిమిషంలో సంజయ్ డైలాగ్స్‌లో మార్పులు చేశారు. దాంతో స్పాట్‌లో డైలాగ్స్ చెప్పడం ఆమెకు కష్టంగా మారింది.

దీపిక తడబాటు..

దీపిక తడబాటు..

డైలాగ్స్ ఫర్‌పెక్ట్‌గా చెప్పలేక తడబాటుకు గురింది. సంజయ్ కొంత అసహనం వ్యక్తం చేయడంతో దీపికా అవమానంగా ఫీలయింది. దాంతో సెట్లోనే బోరుమని ఏడ్చింది. ఆమెను సముదాయించి ఆ రోజంతా డైలాగ్స్ వివరించడానికి సహాయం చేశాం అని గరీమా వాహల్, సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.

అప్‌సెట్ అయి కంటతడి.

అప్‌సెట్ అయి కంటతడి.

సహజంగా డైలాగ్స్ గుర్తుంచుకోవడంలో, వాటిని పర్ఫెక్ట్‌గా చెప్పడంలో దీపికా బెస్ట్. కానీ సడన్‌గా డైలాగ్స్ మార్చడంతో ఆమె అప్‌సెట్ అయ్యారు. మార్చిన సన్నివేశం, డైలాగ్స్ తెరపై అద్భుతంగా పండింది. చిత్రంలో తొలిసారి రామ్, లీలాలు కలుసుకొనే సన్నివేశమది. ఆ ఒక్కరోజు కొంత తడబాటుకు గురైంది కానీ.. దీపిక సహజంగానే ధైర్యం ఉన్న నటి అని వారు ప్రశంసించారు.

పద్మావతిలో మరోసారి సంజయ్‌తో..

పద్మావతిలో మరోసారి సంజయ్‌తో..

గోలియోంకీ రాస్ లీలా, రాంలీలా చిత్రం తర్వాత సంజయ్ దర్శకత్వం వహించిన బాజీరావు మస్తానీలో కూడా దీపికా నటించింది. ప్రస్తుతం భన్సాలీ డైరెక్షన్‌లో రూపొందుతున్న పద్మావతిలో దీపిక ఓ కీలకపాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రం 2017 నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
During the shoot of Ram Leela, Deepika Padukone was reduced to tears on the sets. Writers of the film Garima Wahal and Siddharth Singh revealed that Incident, It was Day 1 of shoot for her. Deepika had broken down because of some last-minute changes in the dialogues," said Garima.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more