For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పడుకుంటేనే ఛాన్స్... నేనేమైనా వేశ్యనా? ఆ లేడీస్ వల్లే ఈ దుస్థితి: ‘ఫిదా’ ఫేం గాయిత్రి

  By Bojja Kumar
  |

  ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి పాపులర్ అయిన నటి గాయిత్రి గుప్తా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 11 సంవత్సరాలైనా 'ఫిదా' సినిమా తర్వాతే ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  ఇండస్ట్రీ అనగానే ఇంట్లో వద్దని చెప్పారు. అక్కడ అంతా పాడైపోయిన వారే ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు ఉంటారు. తప్పుడు పనులు చేస్తేనే అక్కడ పైకొస్తారు అని వద్దన్నారు. నాన్న అయితే స్ట్రిక్ట్ గా నో చెప్పారు. దీంతో తొలుత టీవీలో కుక్కరీ షోలు చేస్తూ మెల్లి మెల్లిగా సినిమాల వైపు అడుగులు వేశాను అని గాయిత్రి తెలిపారు.

   ఇంట్లో ముందే హెచ్చరించారు

  ఇంట్లో ముందే హెచ్చరించారు

  నేను సినిమాలు చేస్తాను అన్నపుడు నా ఫ్రెంగానీ, అన్నయ్యవాళ్లుగానీ పడుకుంటే గానీ పనులు అవ్వవు కదా, అలాంటి కెరీర్ ఎందుకు ఎంచుకుంటావు అన్నారు. నీలాంటి అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీ అనేది రైట్ ప్లేసు కాదన్నారు. మీరెందుకు అలా డెఫనెషన్ చేసి పెట్టేస్తున్నారో అర్థం కాలేదని చెప్పి ఇటు వైపు వచ్చేశాను అని గాయిత్రి తెలిపారు.

   ఇండస్ట్రీ చెడ్డది కాదు

  ఇండస్ట్రీ చెడ్డది కాదు

  ఇండస్ట్రీ చెడ్డది కాదు. ఇండస్ట్రీ అనేది, ఫిల్మ్ కల్చర్ అనేది ఒక లిబరేషన్. చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది. ఫాదర్ రేప్ చేసిన సంఘటనలు, తమ్ముడు రేప్ చేసిన సంఘటనలు మామూలు సమాజంలోనూ ఉన్నాయి. అతడు ఇండస్ట్రీ పర్సన్ కాక పోయినా ఇలాంటివి జరుగుతున్నాయి.

   అవకాశాల కోసం పడుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది

  అవకాశాల కోసం పడుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది

  సినిమా ఇండస్ట్రీలోనే ఇలా ఎందుకు ఉందంటే... బేసిగ్గా జీవితంలో మనం ఎదగాలంటే మెట్లు ఉంటాయి. లిఫ్టు ఉంటుంది. మెట్లు ఎంచుకోవాలంటే టైమ్ టేకింగ్ ఈజీ కాదు. చాలా కష్టం కూడా ఉంటుంది. అవకాశాల కోసం పడుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది.... అని గాయిత్రి అన్నారు.

   అలాంటివి చేస్తే నీ లైఫ్ మీద కంట్రోల్ పోతుంది

  అలాంటివి చేస్తే నీ లైఫ్ మీద కంట్రోల్ పోతుంది

  నాకు హీరోయిన్ గా చేయాలని ఉంది, నేను పడుకుంటాను అనేది కొందరు అమ్మాయిలు ఇచ్చే ఫేవర్. ఇండస్ట్రీలో అలా అడిగే వారు ఉన్నారు కాబట్టే ఇలాంటివి జరుగడం సహజం. అడిగిన దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎవరితోనూ పడుకోలేదు, కానీ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాను. ఒకసారి నువ్వు అలాంటివి చేస్తే నీ లైఫ్ మీద కంట్రోల్ కోల్పోతావు.... అని గాయిత్రి తెలిపారు.

   అలా ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి ఉండదు

  అలా ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి ఉండదు

  కొందరు అమ్మాయిలు ఒక ప్రాజెక్టుకు పడుకుంటే హీరోయిన్ అయిపోతాను అనుకుంటారు. అక్కడ వర్క్ వస్తుందా? లేదా? అనేది గ్యారంటీ ఉండదు. అదే సమయంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పడుకుంటే ఆతడు ఇంకొకరికి చెప్పి వాడు నంబర్ డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్లు ఈ అమ్మాయికి కాల్ చేసి వేధిస్తారు. అపుడు మనశ్శాంతి ఉండదు, లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. అలా చేయడం ద్వారా నీ లైఫ్ కంట్రోల్ ఇంకొకరికి ఇచ్చేస్తున్నావ్. అపుడు ఎంత డబ్బు సంపాదించినా నీకు మనశ్శాంతి అనేది ఉండదు. అందుకే మనం పవర్ ఫుల్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మొదట మనం సరిగ్గా ఉండాలి. చేసే పనులబట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది.... అని గాయిత్రి తెలిపారు.

  రియల్ సక్సెస్ అంటే ఇదే

  రియల్ సక్సెస్ అంటే ఇదే

  కొందరు నన్ను అడుగుతుంటారు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది. నీకు ఉన్న టాలెంటుకు, తెలివికి ఇప్పటికే పెద్ద స్టార్ అయిఉండాలి. కానీ ఎందుకు కాలేదని కొందరు మీడియా ఫ్రెండ్స్ అడుగుతుంటారు. మీ బాషల్లో సక్సెస్ అంటే ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్. నా దృష్టిలో సక్సెస్ అంటే నాకు ఇష్టమున్న పనులు చేయడం. నాకు షూట్లు ఇష్టం, యాక్టింగ్ ఇష్టం. పాటలు పాడటం ఇష్టం, డైరెక్టర్లను కలవడం ఇష్టం, కొత్తవారిని కలవడం ఇష్టం, మార్నింగ్ టు ఈవింగ్ జాబ్ చేయకుండా రిలాక్స్ గా చిల్ ఔట్ గా ఉండటం ఇష్టం. నాకు ఇష్టమైన లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. అందుకే నేను సక్సెస్ ఫుల్ అని ఫీలవుతున్నాను అని గాయత్రి తెలిపారు. సక్సెస్ ఫుల్ ఫిల్మ్ అనేది పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సక్సెస్ కూడా వస్తుంది పోతుంది. జీవితంలో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతామో అదే రియల్ సక్సెస్ అన్నారు.

   డైరెక్టర్, రైటర్, సినిమాటోగ్రాఫర్ తో కూడా పడుకోవాలన్నారు

  డైరెక్టర్, రైటర్, సినిమాటోగ్రాఫర్ తో కూడా పడుకోవాలన్నారు

  సినిమాల కోసం ఆడిషన్స్ వెళుతున్న సమయంలో ఒకరు ఓ విషయం అడిగారు. నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తే నాకేంటి లాభం అన్నారు. నాకు అర్థం కాలేదు. అడిగిన వారి పేరు చెప్పడం ఇష్టం లేదు. కానీ పెద్దవారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్. వాట్ డూ యూ మీన్ సార్ అన్నాను. నిన్ను హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే నువ్వు నాతో పడుకోవాలి, నీ గురించి మంచి స్టోరీ రాయాలి, నిన్ను ఎలివేట్ చేస్తూ కథ అందించాలి అంటే నువ్వు రైటర్ తో పడుకోవాలి. నిన్ను బ్యూటిఫుల్ గా చూపించాలి అంటే సినిమాటోగ్రాఫర్ తో నువ్వు పడుకోవాలి అన్నారు. నాకు ఇలా చెప్పేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. కోపంతో కొట్టేశాను. నాకు బూతులు అలవాటు... అతడిని బూతులు తిట్టేసి వచ్చేశాను.... అని గాయిత్రి తెలిపారు.

   అలా చేసినందుకు హ్యాపీ ఫీలయ్యాను

  అలా చేసినందుకు హ్యాపీ ఫీలయ్యాను

  నేను అలా చేయగానే అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చేసి మీరు మంచి పని చేశారు. పైకి రావాలంటే ఇలాంటి తప్పు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఉండండి. అస్సలు మారొద్దు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లి పోయాడు. వాడికి ఎంత ఈగో హర్ట్ అయిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం అలా చేసినందుకు హ్యాపీ ఫీలయ్యాను. మరో సినిమా ఆడిషన్ కు వెళ్లినపుడు కూడా ఇలాగే రియాక్షన్ వచ్చింది.... అని గాయిత్రి తెలిపారు.

   నన్ను వేశ్యగా చూస్తున్నట్లే

  నన్ను వేశ్యగా చూస్తున్నట్లే

  నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, సినిమాలంటే ఇష్టం ఫ్యాషన్ తో వచ్చాను. అతడు నా బాయ్ ఫ్రెండ్ లేదా భర్త కానప్పుడు నన్ను పడుకోవాలని కోరాడటంటే... అతడు నన్ను వేశ్యగా చూస్తున్నట్లే లెక్క. నేను ఎందుకు ఆ ఫీలింగ్ తీసుకోవాలి, నాకేమవసరం? ఆ మాట వినడం కూడా ఇన్సల్ట్ అనిపించింది. అలా కనిపించానా నేను? అలా పోట్రెయిట్ చేసుకున్నానా నన్ను నేను? ఇలాంటి పరిస్థితి మళ్లీ నా లైఫ్ లో రాకూడదు. కనీసం అలాంటి మాటలు వినకూడదు అనుకున్నాను. నాపై సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి, నాతో అలాంటి మాటలు మాట్లాడాలంటే భయం ఉండాలి, నేను నా అవసరం కోసం వెళితే కదా అలాంటి మాటలు వినాల్సి వస్తుంది... అందుకే నా మార్కెట్లో నా వ్యాల్యూ పెరగాలి, నాకు డిమాండ్ పెరగాలి. వాళ్లు నా దగ్గరకు వస్తే ఆ గొడవ ఉండదు కదా అని షార్ట్ ఫిలింస్, యాంకరింగ్ చేయడం మొదలు పెట్టాను.... అని గాయిత్రి తెలిపారు.

   రెండు కేసుల వల్ల ఇండస్ట్రీ ఇలా అని జడ్జిమెంట్ చేయలేను

  రెండు కేసుల వల్ల ఇండస్ట్రీ ఇలా అని జడ్జిమెంట్ చేయలేను

  నాకు ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఏమీ లేదు. ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితి గురించి అర్థమైంది. అలా అని నాకు ఎదురైన రెండు కేసుల వల్ల ఇండస్ట్రీ ఇలా అని జడ్జిమెంట్ చేయలేను. ఇండస్ట్రీని అర్థం చేసుకుంటూ యాంకరింగ్, షార్ట్ ఫిల్మ్ చేయడం మొదలు పెట్టాను.... అని గాయిత్రి తెలిపారు.

   ఫోన్ చేసి వేధించాడు

  ఫోన్ చేసి వేధించాడు

  నా స్ట్రగుల్ అయిన తర్వాత అక్కడి నుండి పారిపోయిన తర్వాత....నేను కొట్టిన వాడు ఫోన్ చేయడం, మెసేజ్ పెట్టడం మొదలు పెట్టాడు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు హీరోయిన్ అయిన తర్వాత చేసే పని ఇదే కదా... అదేదో ఫస్ట్ నేను చేస్తా అలవాటు చేసుకో... నాకు ఇలా మాటలు వినిపించే సరికి కోపం వచ్చింది.... అని గాయిత్రి.

   అలాంటి ఆడవారి వల్లే

  అలాంటి ఆడవారి వల్లే

  ఆ పరిస్థితికి నేను రెస్పాన్సిబుల్ కాదు. అలాంటివి నాకు ఇష్టం లేదు. నేను అలాంటి పరిస్థితుల్లో పడటానికి ఆడవాళ్లు కూడా కారణం అయ్యారు. కొందరు పడుకుని ప్రాజెక్టులు తెచ్చుకుని చేయడం వల్లే ఇష్టం లేని వాళ్లు కూడా అందులో పడిపోతున్నారు.... అని గాయిత్రి తెలిపారు.

  English summary
  The casting couch in Tollywood has long been known as the place where sexual favours are demanded by a powerful film producer or directors. Actress Gayatri Gupta said some interesting comments about casting couch in a recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X