»   » వాళ్ల జీవితాలు నాశనం చేయొద్దు: నటి హేమ సంచలన కామెంట్స్!

వాళ్ల జీవితాలు నాశనం చేయొద్దు: నటి హేమ సంచలన కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీడియా పరిధి పెరిగిన తర్వాత సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇక వారికి సంబంధించిన ఏదైనా ఎఫైర్స్, సెక్స్ రాకెట్, లైంగిక వేధింపులు, రేప్ సంఘటనలకు సంబంధించిన వార్తలు వస్తే మీడియాలో వీటికి సంబంధించిన హడావుడి, కవరేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. మళ్లీ మళ్లీ ఆ వార్తలను ప్రసారం చేయడం లాంటివి జరుగుతాయి.

అందరికంటే ముందుగా ఆ వార్తలను ప్రసారం చేసి లాభపడాలనే ధ్యాసే తప్ప.... ఇలాంటి విషయాల్లో నిజా నిజాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మీడియా వల్ల కొన్ని సందర్బాల్లో ఏ తప్పూ చేయని నటీనటులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంటున్నారు ప్రముఖ నటి హేమ.

వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి?

వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి?

ఒక నటి అనుకోకుండా ఏదైనా అన్ వాంటెడ్ ఎఫైర్స్, సెక్స్ ట్రాప్స్ లో ఇరుక్కుంటే... తర్వాత ఆమె కుటుంబం పరిస్థితి చాలా క్రిటికల్ గా మారుతుంది. ఇలాంటి వార్తలను మళ్లీ మళ్లీ ప్రసారం చేసి మీరు ఏం సాధిస్తారు? వారి జీవితం నాశనం కావడానికి మీడియా వారు కూడా పరోక్షంగా కారణం అవుతున్నారు అంటోంది హేమ.

బ్లడీ మనీ

బ్లడీ మనీ

అలాంటి వార్తలు ప్రసారం చేయడం వల్ల మీరు కోటి రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం...ఒకరి జీవితాన్ని నావనం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో మీరు సంతోషంగా మీ భార్య, బిడ్డలకు తిండిపెట్టగలరా? అంటూ హేమ ప్రశ్నించింది.

అలాంటి వార్తలు వద్దు

అలాంటి వార్తలు వద్దు

ఎఫైర్స్, సెక్స్ రాకెట్స్ లాంటి కేసుల్లో నిజా నిజాలు తేలకముంందే సదరు నటి పేరు బయట పెడుతూ వార్తలు ప్రసారం చేయడం మంచిది కాదు, వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి అలాంటి వార్తలు ఆపండి అంటున్నారు హేమ.

భిన్నాభిప్రాయాలు

భిన్నాభిప్రాయాలు

అయితే హేమ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
"If a heroine gets into some unwanted affairs or sex traps, that's because her family's position is critical. What will you get by airing that news repeatedly? Why do you want to ruin her life further? Okay, you may earn 1 crore rupees over that news, but will you be happy feeding your children and wife with that bloody money?" says Actress Hema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu