»   » శ్రీరెడ్డి ఏం ఇరుగదీసింది.. బట్టలు విప్పితే భయపడాలా? బ్లాక్‌మెయిల్ వద్దు.. హేమ ఫైర్

శ్రీరెడ్డి ఏం ఇరుగదీసింది.. బట్టలు విప్పితే భయపడాలా? బ్లాక్‌మెయిల్ వద్దు.. హేమ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిరసనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శ్రీరెడ్డికి మద్దతు నిలుస్తుండగా, మరికొందరు ఆమె తీరును ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యవహారంపై సినీ నటి హేమ ఘాటైన కామెంట్లు చేశారు. ఆమె ఎంచుకొన్న తీరు సరికాదని ఆమె అన్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై హేమ మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో హేమ మాట్లాడుతూ..

Sri Reddy Sensational Comments.. Big People Game Started
శ్రీరెడ్డి కరెక్ట్ కాదు..

శ్రీరెడ్డి కరెక్ట్ కాదు..

సినీ పరిశ్రమలో మహిళా నటీమణులకు సమస్య వస్తే మొదట నేనే స్పందిస్తా. కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వివాదం మీడియాలో నడుస్తున్నా స్పందించకపోవడానికి కారణముంది. ఆమె ఎంచుకున్న విధానం సరైంది కాదు. నిరసన తెలిపే హక్కు శ్రీరెడ్డికి ఉంది. మౌన పోరాటం చేయొచ్చు అని హేమ అన్నారు.

 శ్రీరెడ్డికి అప్లికేషన్ ఇచ్చాం.. కానీ.

శ్రీరెడ్డికి అప్లికేషన్ ఇచ్చాం.. కానీ.

గతంలో ఒక పెద్ద దర్శకుడిపై ఓ హీరోయిన్ తమకు ఫిర్యాదు చేసింది. ఆ దర్శకుడిని మా ప్రతినిథులు పిలిపిస్తే.. ఆ అమ్మాయి రాలేదు. శ్రీరెడ్డి వివాదంలో అనేక సందేహాలు ఉన్నాయి. శ్రీరెడ్డి కోరినట్టే ఆమెకు మా సభ్యత్వానికి సంబంధించిన అప్లికేషన్ ఇచ్చాం. కానీ ఆమె సక్రమంగా పూరించలేదు అని హేమ వెల్లడించారు.

 ఆమెలా రోడ్డున పడలేదు..

ఆమెలా రోడ్డున పడలేదు..

టాలీవుడ్‌లో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని అనడం సరికాదు. సన, నాలాంటి ఎంతోమంది తెలుగు నటీనటులు పరిశ్రమలో మంచిపేరు తెచ్చుకుంటున్నాం. మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే పెద్దల దృష్టికి తీసుకొచ్చాం. కానీ ఇలా రోడ్డున పడలేదు అని హేమ అన్నారు.

 శ్రీరెడ్డి ఏం త్యాగాలు చేసింది

శ్రీరెడ్డి ఏం త్యాగాలు చేసింది

మా సభ్యత్వం, ఇతర అంశాలకు సంబంధించి మూడు నెలలకొకసారి ఈసీ మీటింగ్ పెట్టుకుంటాం. శ్రీరెడ్డి అప్లికేషన్‌తోపాటు మరికొంత మంది నటుల అప్లికేషన్స్ మా వద్ద ఉన్నాయి. సభ్యత్వం ఉచితంగా కావాలని శ్రీరెడ్డి అడుగుతున్నది. పరిశ్రమ కోసం ఆమె ఏం త్యాగాలు చేసింది? ఏం ఇరగదీసేసి అడుగుతుందో అర్థం కావడం లేదు అని హేమ వివరణ ఇచ్చారు.

 బ్లాక్ మెయిల్ చేస్తే కుదరదు

బ్లాక్ మెయిల్ చేస్తే కుదరదు

మా సభ్యత్వం కోసం అప్లికేషన్ ఇచ్చేసి బ్లాక్‌మెయిల్ చేస్తే కుదరదు. సభ్యత్వం ఇవ్వలేదంటూ శ్రీరెడ్డి ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు అని హేమ మండిపడ్డారు. ఆమె ఇలాగే ప్రవర్తిస్తే ఏ మాత్రం ప్రోత్సహించేది లేదు. మాలో 800 మంది సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం అని హేమ స్పష్టం చేశారు.

 అదే చివరిదవుతుంది..

అదే చివరిదవుతుంది..

కొద్దిరోజుల క్రితం తనతో శ్రీరెడ్డి ఫోన్‌లో మాట్లాడింది. మీడియాలో చర్చకు తనను ఆహ్వానించింది. కానీ నేను వెళ్లకూడదని నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే ఆమె ఎంచుకొన్న వివాదం సరికాదు. ఒకవేళ మీడియాలో జరిగే చర్చలో పాల్గొంటే అదే నీకు చివరిది అవుతుంది అని తనతో అన్నానని హేమ వివరించారు.

బట్టలిప్పేస్తే ఇచ్చేయాలా?

బట్టలిప్పేస్తే ఇచ్చేయాలా?

తెలుగమ్మాయి ఎంత చక్కగా ఉంటారో అందరికీ తెలుసు. ఈ అమ్మాయి అలా ప్రవర్తిస్తే ఎవరు వేషాలు ఇస్తారు. నడిరోడ్డు మీదకు వచ్చి బట్టలు విప్పుకుంటే వేషాలిచ్చేస్తారా? ఆమె నిరసన చూసి భయపడాలా? శ్రీరెడ్డి వ్యవహారం సరిగా లేదు అని హేమ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

English summary
Sri Reddy Mallidi Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about casting couch. On saturday, She goes half nude at Hyderabad Film Chamber. In this occassion, Police taken her into custody and sent Banjara Hills police station. In this situation, actress Hema made comments on Srireddy about her membership in MAA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X